Devi Sri Prasad: అవార్డ్‌ వచ్చిన వేళ ఇళయరాజా ఆశీస్సుల కోసం!

ABN , First Publish Date - 2023-08-26T16:47:28+05:30 IST

సీనియర్‌ సంగీత దర్శకుడు, మాస్ర్టో ఇళయరాజాకు (Ilaiyaraaja) సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ (DSP) పాదాభివందనం చేశారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమ ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ పురస్కారాలను ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే!

Devi Sri Prasad: అవార్డ్‌ వచ్చిన వేళ ఇళయరాజా ఆశీస్సుల కోసం!

సీనియర్‌ సంగీత దర్శకుడు, మాస్ర్టో ఇళయరాజాకు (Ilaiyaraaja) సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ (DSP) పాదాభివందనం చేశారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమ ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ పురస్కారాలను ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే! 2021 సంవత్సరానికి గానూ ‘పుష్ప: ది రైజ్‌’ చిత్రానికిగానూ ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డును దేవిశ్రీ సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్‌ ఇళయరాజాను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య చిత్రంతో అలరించిన దేవి ప్రస్తుతం ‘పుష్ప-2’, కంగువా, ఉస్తాద్‌ భగత్‌సింగ్‌, విశాల్‌ 34 చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు.

Updated Date - 2023-08-26T16:48:42+05:30 IST