కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Abhiram Daggubati: దగ్గుబాటి ఇంట పెళ్లి వేడుకలు, కుటుంబం శ్రీలంకకు పయనం

ABN, First Publish Date - 2023-12-05T14:18:35+05:30

దగ్గుబాటి సురేష్ బాబు రెండో కుమారుడు అభిరాం వివాహం కారంచేడులో ఉంటున్న తన మామయ్య కుమార్తెతో రేపు శ్రీలంకలో జరగనుంది. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే జరిగే ఈ వివాహానికి దగ్గుబాటి కుటుంబం ఈరోజు శ్రీలంక పయనమైంది.

Daggubati family

చిత్ర పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న దగ్గుబాటి కుటుంబం పెళ్లి వేడుకలతో హడావిడిగా వుంది. అగ్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, థియేటర్ ఓనర్ అయిన సురేష్ బాబు (Daggubati Suresh Babu's younger son Abhiram is getting married) రెండో కుమారుడు అభిరాం వివాహం రేపు జరగనున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 6 వ తేదీన ఈ వివాహం డెస్టినేషన్ వెడ్డింగ్ గా శ్రీలంకలో జరుపుతున్నారు. అందుకని ఈరోజు దగ్గుబాటి కుటుంబ సభ్యులు అందరూ శ్రీలంకకు పయనం అయ్యారు.

దగ్గుబాటి వెంకటేష్, సురేష్ బాబు, రానా దగ్గుబాటి, చైతన్య అలాగే ఇతర కుటుంబ సభ్యులు అందరూ ఈరోజు హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు. వీరందరితో పాటుగా కుటుంబ సభ్యులు కూడా విమానాశ్రయంలో కనిపించారు. శ్రీలంకలో అభిరాం వివాహం కేవలం తమ కుటుంబ సభ్యులు సమక్షంలో మాత్రమే చేస్తున్నట్టుగా సమాచారం.

దగ్గుబాటి అభిరాం వివాహం చేసుకుంటున్నది కూడా దగ్గర సంబంధం గల అమ్మాయినే అని తెలిసింది. రామానాయుడు తమ్ముడు మనవరాలు (అంటే సురేష్ బాబుకి వరసకి చెల్లెలి కూతురు), మాధవి, నగేష్ చాపరాల కుమార్తె అని తెలిసింది. ఆమె పేరు ప్రత్యూష, ఆమె మాస్ కమ్యూనికేషన్ చేసిందని కూడా తెలిసింది.

ఆ కుటుంబం కారంచేడులో వుంటున్నారు. సురేష్ బాబు తండ్రి దగ్గుబాటి రామానాయుడు (Ramanaidu) గారు కుటుంబం అంతా ప్రకాశం జిల్లాలోని కారంచేడు గ్రామం నుండి వచ్చారు. అభిరాం చేసుకోబోయే అమ్మాయి తల్లితండ్రులు కూడా కారంచేడులోనే వుంటున్నారని తెలిసింది. ముహూర్తం రేపు సాయంత్రం 8.50 నిముషాలకి అని తెలిసింది.

అభిరామ్, చేసుకోబోయే అమ్మాయి చిన్నప్పటి నుండి ఒకరికొకరు బాగా ఇష్టపడుతూ వున్నారని, అందుకనే ఈ రెండు కుటుంబాలు ఎప్పుడో ఈ వివాహానికి అంగీకారం తెలిపాయని కూడా తెలిసింది. దగ్గుబాటి అభిరామ్ నటుడిగా ఆరంగేట్రం చేసిన సినిమా 'అహింస' ఆమధ్య విడుదలైంది, ఇప్పుడు సైలెంట్ గా ఓటిటి లోకి కూడా వచ్చేసింది. ఈ సినిమాకి దర్శకుడు తేజ.

Updated Date - 2023-12-05T14:49:51+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!