Chiranjeevi: చాలా బాధగా ఉంది.. కేసీఆర్‌ త్వరగా కొలుకోవాలి

ABN , First Publish Date - 2023-12-08T23:06:22+05:30 IST

తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు(KCR) నిన్న రాత్రి కాలు జారి కిందప‌డి గాయ‌ప‌డిన విష‌యం అంద‌రికీ విధిత‌మే. కాగా ఈ వార్తపై మెగాస్టార్ చిరంజీవి స్ప‌దించి కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు.

Chiranjeevi: చాలా బాధగా ఉంది.. కేసీఆర్‌ త్వరగా కొలుకోవాలి
chiranjeevi kcr

తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు(KCR) నిన్న రాత్రి కాలు జారి కిందప‌డి గాయ‌ప‌డిన విష‌యం అంద‌రికీ విధిత‌మే. గాయ‌ప‌డిన కేసీఆర్ ను వెంట‌నే హైద‌రాబాద్ య‌శోద‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తుండ‌గా ఆయ‌న తొంటి వెముక విరిగింద‌ని, రీప్లేస్మెంట్ స‌ర్జ‌రీ చేస‌క్తున్నామంటూ ఈ రోజు ( శుక్ర‌వారం) ఉద‌యం వైద్యులు ప్ర‌క‌టించారు.#GetWellSoonKcr

కాగా ఈ వార్తపై మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi Konidela) స్ప‌దించి కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు. కేసీఆర్ గాయప‌డ్డార‌నే విషయం తెలిసి చాలా బాధ పడ్డానని, శస్త్ర చికిత్స అనంత‌రం ఆయన త్వరగా కోలుకోవాలని మెగాస్టార్ ఆకాంక్షించారు. ఇప్పుడు ఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతున్న‌ది. అయితే సినిమా ఇండ‌స్ట్రీ నుంచి కేసార్ ఆరోగ్యంపై స్పందించి సానుభూతి తెలిపిన ఏకైక‌హీరో చిరంజీవినే కావ‌డం గ‌మ‌నార్హం.


ఇదిలాఉండ‌గా చంద్ర‌బాబు జైల్లో ఉంటే స్పందించ‌ని చిరంజీవి ఇప్పుడు స్పందించ‌డం ఏంటని ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి.. బింబిసార ఫేం మల్లిడి వశిష్ట దర్శకత్వంలో మెగా 156 చిత్రంలో నటిస్తున్నారు. అయితే రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో కేసీఆర్‌(KCR)కు తుంటి ఎముక మార్పిడి చికిత్స‌ను విజ‌య‌వంతంగా చేసినట్లు ప్ర‌క‌టిస్తూ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుద‌ల చేశారు. #GetWellSoonKcr ఇప్ప‌టికే ఏపీ సీఎం జ‌గ‌న్ కేసీఆర్ హెల్త్ గురించి ఆయ‌న కుమారుడు కేటీఆర్‌ని అడిగి తెలుసుకున్నారు.

Updated Date - 2023-12-09T07:40:15+05:30 IST