Brahmaji: కౌబోయ్ లుక్ రాజమౌళి, మహేష్ బాబు సినిమా కోసమేనా?

ABN , First Publish Date - 2023-09-23T15:17:15+05:30 IST

బ్రహ్మాజి కొత్త లుక్ లో కొన్ని ఫోటోస్ పోస్ట్ చేశారు. అందులో కౌబాయ్ లో వున్న ఫోటో అయితే విపరీతంగా వైరల్ అవుతోంది. అది రానున్న మహేష్ బాబు, రాజమౌళి సినిమా కోసం అని నెటిజన్స్ అంటున్నారు. ఇంతకీ ఈ కొత్త లుక్ దేనికోసమో తెలుసా...

Brahmaji: కౌబోయ్ లుక్ రాజమౌళి, మహేష్ బాబు సినిమా కోసమేనా?
Brahmaji in a new look

క్యారెక్టర్ నటుడు బ్రహ్మాజి (Brahmaji) సాంఘీక మాధ్యమాల్లో చురుకుగా ఉంటూ వుంటారు. అలాగే అతనిలో వున్న హాస్య గుణాన్ని కూడా తన ట్వీట్ రూపంలో అప్పుడప్పుడు చూపెడుతూ వుంటారు. ఇప్పుడు బ్రహ్మాజి కొత్త లుక్ ఫోటోస్ సాంఘీక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి. అందులో ఒకటి అతను కౌబోయ్ లుక్ లో వున్న ఫోటో అయితే మరీ వైరల్ అయింది. ఇంతకీ ఆ కౌబోయ్ లుక్ దేనికోసమో మరి తెలియదు కానీ, నెటిజన్స్ మాత్రం ఆ లుక్ మహేష్ బాబు (MaheshBabu), రాజమౌళి (Rajamouli) కాంబినేషన్ లో రాబోయే కౌబోయ్ సినిమా కోసమే అని అంటున్నారు.

brahmaji-newlook.jpg

బ్రహ్మాజీ ఇప్పుడు మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ (TrivikramSrinivas) కాంబినేషన్ లో వస్తున్న 'గుంటూరు కారం' #GunturKaaram లో చేస్తున్నారు. అలాగే అతను చాలామందికి లక్కీ అని అంటూ వుంటారు. అందుకే అతను త్రివిక్రమ్ చేసిన అన్ని సినిమాల్లో చిన్న వేషంలో అయినా కనపడతారు. అలాగే మహేష్ బాబుతో కూడా చాలా సినిమాలలో కనపడుతూ వుంటారు. ఇక దర్శకుడు కొరటాల శివ (KoratalaSiva) కూడా బ్రహ్మాజీ ని తన సినిమాలలో ఒక మంచి పాత్ర ఇస్తూఉంటాడు. జూనియర్ ఎన్టీఆర్ (JrNTR) సినిమాల్లో కూడా బ్రహ్మాజీ కనపడుతూ వుంటారు.

తాజాగా విడుదలైన 'మిస్టర్ ప్రెగ్నంట్' #MrPregnant సినిమాలో బ్రహ్మాజీ చేసిన ఒక సన్నివేశం కడుపుబ్బా నవ్వించడమే కాకుండా, ఆ సినిమాకి ఒక హైలైట్ గా నిలిచింది. ఎటువంటి పాత్రలో అయినా ఇమిడిపోయే బ్రహ్మాజీ ఇప్పుడు ఇలా ఒక కౌబోయ్ లుక్ లో కనపడటం, అది అతను పోస్ట్ చెయ్యడం, నెటిజన్స్ అది మహేష్, రాజమౌళి సినిమా కోసం అని అంటూ ఉండటం అవి వైరల్ అవ్వటం జరుగుతోంది.

brahmaji-newlook1.jpg

ఇంతకీ అవి మహేష్ బాబు, రాజమౌళి సినిమా కోసమా, లేదా వేరే ఏదైనా సినిమా కోసం లుక్ టెస్ట్ చేశారా అన్నది మాత్రం తెలియటం లేదు. ప్రభాస్ (Prabhas), ప్రశాంత్ నీల్ (PrashanthNeel) కాంబినేషన్ లో వస్తున్న 'సలార్' #Salaar లో కూడా బ్రహ్మాజీ ఒక ముఖ్యపాత్రలో కనపడనున్నారు, అలాగే అల్లు అర్జున్ (AlluArjun), సుకుమార్ (Sukumar) కాంబినేషన్ లో వస్తున్న 'పుష్ప 2' #Pushpa2 లో కూడా బ్రహ్మాజీ ఒక ముఖ్యపాత్రలో కనపడతారు. ఈ సినిమా షూటింగ్ దశలో వుంది ఇప్పుడు. ఇలా వరస సినిమాలతో దూసుకుపోతున్న బ్రహ్మాజీ ఇప్పుడు ఇలా వైవిధ్యమైన వేషాలతో కనపడటం చర్చకి దారితీస్తోంది. అందులో బ్రహ్మాజీ చాలా బాగున్నారు అని, చాలా యంగ్ గా కనపడుతున్నారని అంటున్నారు నెటిజన్స్.

Updated Date - 2023-09-23T15:17:15+05:30 IST