Pallavi Prashanth: బిగ్ బాస్ 7 విన్న‌ర్‌.. పల్లవి ప్రశాంత్ అరెస్ట్

ABN , Publish Date - Dec 20 , 2023 | 07:36 PM

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ను కొద్ది సేప‌టి క్రితం పోలీసులు ఆరెస్ట్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని కొల్గూర్ గ్రామంలోని తన ఇంటి వద్ద అదుపులో తీసుకున్న పోలీసులు వెంట‌నే ఆయ‌న‌ను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు సమాచారం.

Pallavi Prashanth: బిగ్ బాస్ 7 విన్న‌ర్‌.. పల్లవి ప్రశాంత్ అరెస్ట్
pallavi prasanth

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) ను కొద్దిసేప‌టి క్రితం పోలీసులు ఆరెస్ట్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని కొల్గూర్ గ్రామంలోని తన ఇంటి వద్ద అదుపులో తీసుకున్న పోలీసులు వెంట‌నే ఆయ‌న‌ను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు సమాచారం.


అయితే గ‌త ఆదివారం బిగ్‌బాస్‌ సీజన్‌ 7 (Bigg Boss Season 7) ఫైనల్స్‌ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన గొడవ, విధ్వంసం విషయంలో A1 పల్లవి ప్రశాంత్, A2 ప్రశాంత్ సోదరుడు, A3 వినయ్, A4 డ్రైవర్ సాయికిరణ్, A5‌గా రాజుని నిందితులుగా పరిగణిస్తూ.. పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. వీరిలో డ్రైవర్ సాయికిరణ్, రాజులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుండగా.. పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నట్లుగా వార్త‌లు వ‌చ్చాయి.

అసలు.. ఆ రోజు ఏం జరిగిందంటే?

బిగ్‌బాస్‌ సీజన్‌ 7 ఫైనల్స్‌ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియో వద్దకు అభిమానులు వేలాదిగా చేరుకున్నారు. అనంతరం బిగ్‌బాస్ (Big Boss) ఫైనల్‌ విజేత పల్లవి ప్రశాంత్‌ విజయోత్సవ ర్యాలీ కోసం వచ్చిన అభిమానులు, రన్నర్‌గా నిలిచిన అమర్‌దీప్ (Amardeep) అభిమానులతో ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు.

ఈ ఘటనలో పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్ల కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. అదే దారిలో వస్తున్న ఆర్టీసీ బస్సు‌పై కూడా రాళ్లు విసరడంతో.. ఆ బస్సు అద్దాలు కూడా ధ్వంసం అయ్యాయి. దీంతో పబ్లిక్ న్యూసెన్స్ కింద వారందరిపై కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనలో రాళ్ల దాడులకు పాల్పడిన నిందితులను గుర్తించేందుకు పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

Updated Date - Dec 20 , 2023 | 09:38 PM