సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

NandamuriBalakrishna: ఆ లైనప్ చూస్తే పిచ్చెక్కిపోద్ది, దబిడి దిబిడే !

ABN, First Publish Date - 2023-04-30T17:13:26+05:30

నందమూరి బాలకృష్ణ ఎటువంటి దర్శకులతో, ఎటువంటి సినిమాలు చేస్తున్నాడో తెలిస్తే బాబోయ్ ఇక అభిమానులకు దబిడి దిబిడే !

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అగ్ర నటుల్లో కొంచెం తొందరగా అంటే సంవత్సరానికి రెండు సినిమాలు చేస్తున్న నటుల్లో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఒకరు. ఈ సంవత్సరం జనవరిలో మలినేని గోపీచంద్ (MalineniGopichand) దర్శకత్వం లో 'వీరసింహా రెడ్డి' (Veera Simha Reddy) విడుదల అయింది. ఇప్పుడు బాలకృష్ణ దర్శకుడు అనిల్ రావిపూడితో (Anil Ravipudi) షూటింగ్ చేస్తున్నాడు, అది కూడా ఈ సంవత్సరమే విడుదల అవుతుంది అని అనుకుంటున్నారు. ఇది టైటిల్ ఇంకా పెట్టలేదు, అందుకని దీనికి #NBK108 అని ఒక వర్కింగ్ టైటిల్ ఇచ్చారు అంతే.

ఇది కాకుండా బాలకృష్ణ సినిమాల లైనప్ చూస్తే ఏమి సెట్ చేసుకున్నాడో అని ఆశ్చర్యం వేస్తుంది. తదుపరి సినిమా #NBK109 దర్శకుడు ఎవరో తెలుసా, ఇంకెవరు బోయపాటి శ్రీను (Boyapati Srinu). బోయపాటి వరసగా మూడు సినిమాలు చేసి మూడు పెద్ద హిట్స్ కొట్టి మళ్ళీ అదే కాంబినేషన్ లో బాలకృష్ణ సినిమా అంటే అభిమానులకు దబిడి దిబిడే. దీనికి నిర్మాతగా 14రీల్స్ అని ఒక వార్త నడుస్తోంది. 'సింహ', 'లెజెండ్', 'అఖండ' (Akhanda) తరువాత ఈ రాబోయే సినిమా ఇంకా పీక్స్ లో ఉంటుంది అని ఒక టాక్.

దీని తరువాత #NBK110 దర్శకుడు బాలకృష్ణకి మంచి స్నేహితుడు కూడాను. అతను మరెవరో కాదు పూరి జగన్నాథ్ (Puri Jagannadh). వీళ్ళిద్దరూ ఇంతకు ముందు 'పైసా వసూల్' (Paisa Vasool) చేశారు, ఇప్పుడు ఇంకో సినిమాకి ఈ ఇద్దరూ మళ్ళీ కలుస్తున్నారు. పూరి కనెక్ట్ ఈ సినిమాకి నిర్మాత. ఇది అయ్యాక బాలకృష్ణ #NBK111 దర్శకుడు చింరజీవికి (MegaStar Chiranjeevi) 'వాల్తేర్ వీరయ్య' (Waltair Veerayya) లాంటి పెద్ద హిట్ ఇచ్చిన బాబీ (Bobby). సితార ఎంటర్ టైన్ మెంట్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ కి నిర్మాతగా ఉంటారని టాక్.

ఈ రెండు సినిమాల తరువాత ఇంకో పెద్ద సినిమాకి బాలయ్య శ్రీకారం చుడుతున్నాడు. అది మరెవరో కాదు, మహేష్ బాబు (Mahesh Babu) తో 'సర్కారు వారి పాట' (SarkaruVariPaata) లాంటి హిట్ సినిమా తీసిన పరశురామ్ (Parasuram) లేదా బుజ్జి. ఇప్పుడు బాలకృష్ణ తో చేతులు కలుపుతున్నాడు. ఈ సినిమా ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారో తెలుసా, గీత ఆర్ట్స్ (Geetha Arts), అల్లు అరవింద్ (Allu Aravind). ఇవి వరసగా బాలకృష్ణ ప్రాజెక్ట్స్, ఇలా ఒకదానితరువాత ఒకటి అనుకున్నట్టు అయితే కనక, దబిడి దిబిడే !

Updated Date - 2023-04-30T17:13:26+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!