Unstoppable: బాలీవుడ్ ని కూడా వదలని బాలకృష్ణ

ABN , First Publish Date - 2023-11-14T13:57:16+05:30 IST

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వస్తున్న ఒక షోలో ఇప్పుడు బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ వస్తున్నాడు అని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ ఎపిసోడ్ త్వరలోనే ప్రసారం కానుంది అని కూడా అంటున్నారు.

Unstoppable: బాలీవుడ్ ని కూడా వదలని బాలకృష్ణ
Balakrishna and Ranbir Kapoor

నందమూరి బాలకృష్ణ (NandamuriBalakrishna) షో 'అన్ స్టాపబుల్' #Unstoppable ఒక ప్రైవేట్ ఓటిటి ఛానల్ లో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ షో సీజన్ 3 లోకి వచ్చింది. ఇందులో మొదటి ఎపిసోడ్ 'భగవంత్ కేసరి' #BhagavanthKesari టీముతో బాలకృష్ణ చిట్ చాట్ చేశారు, తరువాత ఇప్పుడు బాలకృష్ణ నేరుగా బాలీవుడ్ కె వెళ్లిపోయారు. రణబీర్ కపూర్ (RanbirKapoor), రష్మిక మందన్న (RashmikaMandanna) జంటగా నటిస్తున్న హిందీ సినిమా 'యానిమల్' #Animal, సందీప్ రెడ్డి వంగా (SandeepReddyVanga) దీనికి దర్శకుడు. ఈ సినిమా కథానాయకుడు రణబీర్ కపూర్ 'అన్ స్టాపబుల్' షో కి వస్తున్నట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.

Balakrishna-1.jpg

ఇప్పుడు రణబీర్ కపూర్, బాలకృష్ణ కలిసి వున్న ఫోటోలు సాంఘీక మాధ్యమంలో వైరల్ అవుతూనే వున్నాయి. ఈ షోకి రణబీర్ కపూర్ వస్తున్నాడు అని, రష్మిక కూడా పాల్గొంటోందని అంటున్నారు. అయితే బాలకృష్ణ, రణబీర్ తో ఎలా మాట్లాడేరు, ఎటువంటి ప్రశ్నలు అడిగారు, ఎలా అతనితో మాట్లాడించేరు అన్నదే చాలామందికి ఆసక్తికరం అని తెలుస్తోంది.

'యానిమల్' సినిమా డిసెంబర్ 1వ తేదీన విడుదలవుతుందని అంటున్నారు. ఆ సినిమా టీజర్, ట్రైలర్, పాట అన్నీ కూడా ఆసక్తికరంగా వుంది, వైరల్ కూడా అయ్యాయి. ప్రతి హిందీ సినిమాని దక్షిణాది భాషల్లో ముఖ్యంగా తెలుగులో విడుదల చెయ్యడానికి ప్రతి బాలీవుడ్ నటుడు ఆసక్తి చూపిస్తున్నారు. అప్పుడు షా రుఖ్ ఖాన్ (ShahRukhKhan) 'జవాన్' #Jawan విడుదలైంది, నిన్న సల్మాన్ ఖాన్ (SalmanKhan) 'టైగర్ 3' Tiger3 తెలుగులో విడుదలయింది, ఇప్పుడు 'యానిమల్' కూడా తెలుగులో విడుదలవుతోంది. అందుకే తెలుగులో ప్రచారాలు ముమ్మరంగా చేస్తున్నారు అని తెలిసింది.

Updated Date - 2023-11-14T13:57:17+05:30 IST