Anushka Shetty: అందరూ మెచ్చే.. అందరికీ నచ్చే.. అరుదైన బొమ్మాళి!

ABN , First Publish Date - 2023-11-07T19:53:55+05:30 IST

హీరోలకు సమానంగా ఇమేజ్ తెచ్చుకునే హీరోయిన్లను సినిమా ఇండస్ట్రీలో వేళ్లపై లెక్కపెట్టవచ్చు. అలాంటి వారిలో అరుదైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అనుష్క శెట్టి. తన అందం, అభినయం, విజయాలతో హీరోల‌కు స‌మానంగా ఇమేజ్, మార్కెట్ సంపాదించుకుంది అనుష్క. మంగళవారం అనుష్క బర్త్‌డేను పురస్కరించుకుని సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Anushka Shetty: అందరూ మెచ్చే.. అందరికీ నచ్చే.. అరుదైన బొమ్మాళి!
Anushka Shetty

హీరోలకు సమానంగా ఇమేజ్ తెచ్చుకునే హీరోయిన్లను సినిమా ఇండస్ట్రీలో వేళ్లపై లెక్కపెట్టవచ్చు. అలాంటి వారిలో అరుదైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అనుష్క శెట్టి (Anushka Shetty). తన అందం, అభినయం, విజయాలతో హీరోల‌కు స‌మానంగా ఇమేజ్, మార్కెట్ సంపాదించుకుంది అనుష్క (Anushka). ఆమె న‌టించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ‘అరుంధ‌తి, రుద్ర‌మ‌దేవి, భాగ‌మ‌తి’ బాక్సాఫీస్ వ‌ద్ద తిరుగులేని విజ‌యాల్ని సాధించి ఈ విషయాన్ని ప్రూవ్ చేశాయి. రీసెంట్‌గా అనుష్క నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (MSMP) బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అనుష్క చేసిన అన్విత పాత్ర ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. అనుష్క నటన హైలైట్‌గా సాగిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఒక స్పెషల్ మూవీగా సెలబ్రిటీల, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటూనే కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకుంది. నవంబర్ 7 అనుష్క పుట్టిన రోజు.. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విషయాలు.. (HBD Anushka Shetty)

నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టారు అనుష్క. మొదటి సినిమాతోనే అందం,అభినయంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఆ తర్వాత స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూనే సోలోగా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌తో మెప్పించడం ఆమెకే సాధ్యమైంది. ‘వేదం’ సినిమాలో సరోజ పాత్రలో అనుష్క నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ‘అరుంధతి, వేదం, రుద్రమదేవి’ సినిమాల్లోని నటనకు గానూ ఆమె ‘ఫిలిమ్ ఫేర్’ అవార్డును అందుకున్నారు. (Anushka Birthday)


Anushka.jpg

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ (Bahubali) సినిమాలోని ‘దేవసేన’ (Devasena) పాత్రలో అనుష్క నటన ఆమెను కెరీర్‌లో అగ్ర స్థానంలో నిలబెట్టింది. ‘సైజ్ జీరో’ సినిమా కోసం అనుష్క చేసిన హార్డ్ వర్క్ సినిమా పట్ల ఆమెకున్న కమిట్‌మెంట్ తెలియజేసింది. చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’లో అనుష్క ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో చిరస్మరణీయమైన పాత్రలో కనిపించారు. 2021లో విడుదలైన ‘నిశ్శబ్దం’ ఆమె గొప్ప నటనకు మరో ఉదాహరణగా నిలిచింది. అనుష్క అద్భుతమైన నట ప్రయాణం మరిన్ని ఆసక్తికర సినిమాలతో ముందుకు సాగనుంది. త్వరలో అనుష్క 50వ సినిమా ‘భాగమతి-2’ని యూవీ క్రియేషన్స్‌లో భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను అతి త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. తన నటనతోనే కాకుండా.. తను కనిపించే తీరుతోనూ అందరి మనసును దోచుకునే స్వీటీ అనుష్క శెట్టి‌కి హ్యాపీ బర్త్ డే (Happy Birthday Anushka).


ఇవి కూడా చదవండి:

========================

*Dum Masala: ‘గుంటూరు కారం’ దమ్ మసాలా సాంగ్ టాకేంటి?

*************************************

*Ranjana: అందుకే విద్యార్థులను కొట్టా.. నటి రంజనా సంచలన వ్యాఖ్యలు

*************************************

Updated Date - 2023-11-07T19:55:04+05:30 IST