సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Anupama Parameshwaran: ఏంటి అనూ అలాంటివి చెయ్యొద్దు అని అభిమానులు నెట్టింట హర్ట్ అయ్యారు

ABN, First Publish Date - 2023-06-05T19:10:17+05:30

నటి అనుపమ పరమేశ్వరన్ కి ఒక ఇమేజ్ వుంది. ఆమె ఎటువంటి పాత్ర ఇచ్చినా అవలీలగా అందులో పరకాయ ప్రవేశం చేసి మంచి నటిగా నిరూపించుకుంది. అలాగే ఆమె గ్లామర్ విషయంలో గీత దాటలేదు, కానీ ఇప్పుడు ఆమె ఒక సినిమా స్టిల్ పోస్ట్ చెయ్యగానే ఆమె అభిమానులు చాలామంది హర్టు అయ్యాం అంటున్నారు.

Anupama Parameshwaran
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న నటి అనుపమ పరమేశ్వరన్ (AnupamaParameshwaran). ఆమెకి ఇన్స్టాగ్రామ్ లో చాలామంది ఫాలోవర్స్ వున్నారు, అలాగే ఆమె చిన్న వయసులోనే మంచి నటిగా బాగా పేరు తెచ్చుకుంది కూడా. ఎటువంటి పాత్ర అయినా అవలీలగా ఆ పాత్రని తన నటనతో మెప్పించి అదరగొడుతుంది అనుపమ. సినిమా ఎలా వున్నా, అనుపమ నటన బాగుంది అని అంటారు. మరి అలాంటి అనుపమ మీద ఆమె అభిమానులు ఎందుకు హర్ట్ అవుతున్నారు. అంటే ఇదీ కథ.

ఇవాళ 'టిల్లు స్క్వేర్' (TIlluSquare) విడుదల తేదీ ప్రకటించారు. సిద్ధు జొన్నలగడ్డ (SiddhuJonnalagadda) కథానాయకుడిగా నటిస్తుండగా, అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా సిద్ధు పక్కన నటిస్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ (Sithara Entertainments) నాగవంశీ (NagaVamsi), ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (TrivikramSrinivas) భార్య సాయి సౌజన్య (SaiSoujanya) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే 'డీజే టిల్లు' (DJ Tillu) మొదటి సినిమాలో కొంచెం అడల్ట్ కామెడీ, అలాగే చిన్న విట్టి డైలాగ్స్ వున్నాయి. అదీ కాకుండా సిద్ధూ జొన్నలగడ్డ సినిమాల్లో కొంచెం అడల్ట్ కామెడీ ఎక్కువ ఉంటుంది.

అందుకని అనుపమ అభిమానులు అందరూ చాలా హర్ట్ అవుతున్నారు. ఎందుకు ఇలాంటి సినిమాలు చేస్తున్నావ్, ఇలాంటివి చేస్తే నీ మీద క్రష్ తగ్గుతుంది అని ఒకరు అంటే, నీ అభిమానులు తగ్గిపోతారు అని ఇంకొకరు అన్నారు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చెయ్యగానే ఈ వార్త చూడగానే ఒకడు హర్ట్ అయ్యాడట, ఇలా అనుపమ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కిందా చాలామంది అభిమానులు తమకు అనుపమ ఇలా చెయ్యడం నచ్చలేదని అంటున్నారు.

అయితే అనుపమ ఇంత వరకు ఏ సినిమాలో కూడా గ్లామర్ గా కనిపించింది కానీ అది పరిధి మేరకే నటించింది. అయితే దిల్ రాజు అన్న కుమారుడు ఆశిష్ (AshishReddy) తో నటించిన 'రౌడీ బాయ్స్' (RowdyBoys) సినిమాలో లిప్ లాక్ పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పుడే అందరూ ఏంటి అనుపమ ఆలా చేసిందా అని చర్చ కూడా నెట్టింట అయింది. ఇప్పుడు ఈ 'టిల్లు స్క్వేర్' లో చెయ్యడం, ఆ స్టిల్ రావటం, ఇవన్నీ అనుపమ అభిమానులకి కొంచెం హర్ట్ అయ్యే విధంగా వున్నాయి అనిపిస్తోంది.

Updated Date - 2023-06-05T19:10:17+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!