AnasuyaControversy: అది విజయ్ దేవరకొండని ఉద్దేశించి పెట్టిందా? నెటిజన్స్ ఏమంటున్నారు అంటే...

ABN , First Publish Date - 2023-05-06T11:38:50+05:30 IST

అనసూయ, విజయ్ దేవరకొండ అభిమానులు మరోసారి ట్విట్టర్ లో వాదోపవాదాలు చేసుకుంటున్నారు. అనసూయ పరోక్షంగా విజయ్ ని ఉద్దేశించి ఎదో ట్వీట్ చేస్తే, దానికి విజయ్ అభిమానులు కొంచెం అసభ్యంగా రియాక్ట్ అవుతున్నారు, ట్రోల్ చేస్తున్నారు

AnasuyaControversy: అది విజయ్ దేవరకొండని ఉద్దేశించి పెట్టిందా? నెటిజన్స్ ఏమంటున్నారు అంటే...
Anasuya Bharadwaj

ప్రముఖ యాంకర్, నటి అనసూయ (Anasuya) మళ్ళీ వార్తల్లో వుంది. ఈసారి ఎదో ట్వీట్ పెట్టింది, దాని మీద నెటిజన్స్ అందరూ ఆ ట్వీట్ కి రిప్లై ఇస్తున్నారు. ఇంతకీ అనసూయ ఏమి ట్వీట్ చేసింది, అందులో ఎవరిని ఉద్దేశించి ఆలా పెట్టింది క్లియర్ గా రాయలేదు, కానీ దానికి విజయ్ దేవరుకొండ (Vijay Deverakonda) అభిమానులు మాత్రమే ఎక్కువ ప్రతిస్పందిస్తున్నారు. ఇలా వాళ్ళు కూడా ఎదో పెడుతుంటే, దానికి అనసూయ కూడా మళ్ళీ రిప్లై ఇవ్వడం, ఇలా సాంఘీక మాధ్యమం లో పెద్ద గొడవే జరుగుతోంది.

vijayd3.jpg

ఇంతకీ అనసూయ ఏమి ట్వీట్ చేసిందో చూద్దాం. "Ippude okati chusanu.. “The” na?? Babooooiii!!! Paityam.. enchestam.. antakunda chuskundam" (sic) అనింది. "ఇప్పుడే ఒకటి చూసాను.. "ది' న?? బాబోయ్ !!! పైత్యం.. ఏంచేస్తాం... అంటకుండా చూసుకుందాం" అని పెట్టింది. దీనికి విజయ్ దేవరకొండ అభిమానులు అందరూ రియాక్ట్ అవుతూ వున్నారు, అనసూయ మీద కొంచెం బాడ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు.

anasuyabharadwaj4.jpg

వాళ్ళు మొదటి ట్వీట్ కి ట్రోల్ చేస్తూ ఉంటే కొన్ని గంటల తరువాత ఇంకో ట్వీట్ చేసింది. "Bhale react autunnarra donga..oops.. bangarukondalanta.. ekkado akkada nenu nijam anedi prove chestune unnanduku thanks ra abbailu" (sic). "భలే రియాక్ట్ అవుతున్నార్రా దొంగ... ఊప్స్ .. బంగారుకొండలంట... ఎక్కడో అక్కడ నేను నిజం అనేది ప్రూవ్ చేస్తూనే ఉన్నందుకు థాంక్స్ రా అబ్బాయిలు" అని పెట్టింది. ఇందులో 'బంగారు కొండలంట' అనే పడ్డం ఎవరిని ఉద్దేశించి అని ఉంటుందో అందరూ ఊహించే వుంటారు. ఇలా అంతంతో ఇది మరికొంచెం కాంట్రవర్సీ అయింది.

Updated Date - 2023-05-06T16:19:44+05:30 IST