Mahesh-Allu Arjun: మహేష్ బాబు పోస్టుకి, అల్లు అర్జున్ లైక్ కొట్టారు, ఇప్పుడిదే వైరల్

ABN , Publish Date - Dec 25 , 2023 | 01:57 PM

ఇన్ స్టాగ్రామ్ లో మహేష్ బాబు తన కుమార్తె సితార తో వున్న ఫోటో ఒకటి పోస్ట్ చేశారు. అది అల్లు అర్జున్ లైక్ కొట్టారు, ఇప్పుడు ఇది సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Mahesh-Allu Arjun: మహేష్ బాబు పోస్టుకి, అల్లు అర్జున్ లైక్ కొట్టారు, ఇప్పుడిదే వైరల్
Mahesh Babu and Allu Arjun

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రతి అగ్ర నటుడికి సామజిక మాధ్యమాల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండటమే కాకుండా, వాళ్ళు పెట్టిన పోస్టులు వార్తలుగా కూడా అవుతూ ఉంటాయి. అలాగే తెలుగులో నటులకు వున్నన్ని అభిమాన సంఘాలు, అభిమానులు వేరే భాషా నటులకి లేవంటే అతిశయోక్తి కాదేమో. ఒక నటుడి సినిమా విడుదలవుతోంది అంటే అతని అభిమానులు ఆ సినిమాని సామజిక మాధ్యమాల్లోనే కాకుండా, ఆ సినిమా విడుదలవుతున్న థియేటర్స్ దగ్గర కట్ అవుట్ లు పెట్టి, దండలు కట్టి, పాలాభిషేకాలు చేసే సందర్భాలు ఎన్నో వున్నాయి.

ఇవే కాకుండా అభిమానులు ఒకరిమీద ఒకరు విమర్శలు, దూషణలు కూడా చేసుకుంటూ వుంటారు. అది నిత్యం చూస్తూనే ఉంటేం. అలాగే తెలుగు నటులకి, అభిమానులకి తమ సినిమా రికార్డులు, కలెక్షన్స్, అంకెలు, లెక్కలు ఇవి ఎక్కువగా చూస్తూ వుంటారు, అందుకే ఒక నటుడి సినిమా విడుదలవ్వగానే ఆ సినిమా మొదటి రోజు, మూడు రోజులు, వారం రోజులు ఇలా అన్ని రికార్డ్స్ పెట్టడమే కాకుండా, వేరే నటులతో పోలుస్తూ వుంటారు కూడా. ఇప్పుడు సాంకేతిక బాగా వచ్చింది కాబట్టి, ఇవన్నీ సామజిక మాధ్యమాల్లో చూస్తూ ఉంటాము. ఇలాంటి కలెక్షన్స్, రికార్డుల వలెనే ఈ అగ్ర నటుల మధ్య అంతరాలు వస్తూ ఉంటాయి అని అభిమానులు అనుకుంటూ వుంటారు.

maheshbabupost.jpg

కానీ నిజానికి ఈ నటుల మధ్య ఎటువంటి విభేదాలు వుండవు. ప్రొఫెషనల్ గా వాళ్ళ మధ్య పోటీ ఉండొచ్చు ఏమో గానీ, నటులుగా వాళ్ళందరూ ఒకటే. ఇంతకు ముందు చాలామంది అదే విషయాన్నీ వేదికలమీద కూడా చెప్పారు, కానీ సామజిక మాధ్యమాల్లో మాత్రం అభిమానులు ఇతర నటుల్ని దూషించడం లాంటివి చేస్తూ వుంటారు. అయితే మా మధ్య అలాంటివి లేవని ఈమధ్యనే ఇంకొక ఉదాహరణ అల్లు అర్జున్ ద్వారా తెలిసింది.

మహేష్ బాబు తన కుమార్తె సితార పాపతో వున్న ఫోటో ఒకటి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఆ పోస్టుకి అల్లు అర్జున్ లైక్ కొట్టారు, ఇప్పుడు ఇది వైరల్ అవుతోంది. అల్లు అర్జున్, మహేష్ బాబు పెట్టిన ఫోటోకి లైక్ కొట్టారు అని సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ వస్తోంది. అల్లు అర్జున్ తో పాటు, సమంత, శృతి హాసన్, అడివి శేష్ ఇంకా చాలామంది ఈ ఫోటో కి లైక్ కొట్టారు. అయితే ఇలా ఒక స్టార్ పెట్టిన పోస్టుకి ఇంకో స్టార్ లైక్ కొట్టడం కూడా వైరల్ అవటం, అభిమానులని అలరించటం సంతోషమే కదా!

Updated Date - Dec 25 , 2023 | 01:57 PM