Prabhas: 50 రోజుల తరువాత మళ్ళీ హైదరాబాద్ వచ్చిన ప్రభాస్, ఫోటోస్ వైరల్

ABN , First Publish Date - 2023-07-26T15:46:58+05:30 IST

'ఆదిపురుష్' సినిమా విదులైనప్పుడు, అందులో రాముడు పాత్రధారి ప్రభాస్ అసలు ఇండియాలోనే లేదు. విదేశాలకి బ్రేక్ కి వెళ్ళాడు. ఆ సినిమా మీద ఆ సినిమా దర్శకుడు ఓం రౌత్, రచయిత మనోజ్ ముతషీర్ వాళ్ళని బాగా ఆడుకున్నారు నెటిజన్స్. ప్రభాస్ అయితే తప్పించుకున్నాడు అని అప్పట్లో అందరూ అన్నారు. ఇప్పుడు 50 రోజుల తరువాత ప్రభాస్ మళ్ళీ హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాడు. ఆ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.

Prabhas: 50 రోజుల తరువాత మళ్ళీ హైదరాబాద్ వచ్చిన ప్రభాస్, ఫోటోస్ వైరల్
Prabhas from Kalki2898AD

ప్రభాస్ (Prabhas) మళ్ళీ వైరల్ అయ్యాడు, అయితే ఈసారి అతని సినిమా గురించి మాత్రం కాదు. ప్రభాస్ హైదరాబాద్ (Hyderabad) లో ఈరోజు ఉదయం ల్యాండ్ అయ్యాడు, అతను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి బయటకి వస్తున్న వీడియోస్, ఫోటోస్ అన్నీ వైరల్ అయ్యాయి. ఇంతకీ విషయం ఏంటి అంటే దాదాపు 50 రోజుల తరువాతప్రభాస్ హైదరాబాద్ రావటం ఇదే మొదటి సారి.

అప్పుడెప్పుడో 'ఆదిపురుష్' #Adipurush ప్రీ రిలీజ్ వేడుక తిరుపతిలో (Tirupathi) అయింది కదా, దానికి ప్రభాస్ హాజరయ్యాడు.కృతి సనన్ (KritiSanon), ఓం రౌత్ (OmRaut), అలాగే మఠాధిపతి చిన్న జీయర్ స్వామి (ChinnaJeeyarSwamy) ఇంకా చాలామంది హాజరయ్యారు ఆ ఈవెంట్ కి. ఆ తరువాత ప్రభాస్ బ్రేక్ తీసుకొని విదేశాలకి వెళ్ళాడు అని అన్నారు. కొన్ని రోజుల క్రితం కామిక్ కాన్ (ComicCon) లో జరిగిన 'ప్రాజెక్ట్ కె' (ProjectK) టైటిల్ ఈవెంట్, గ్లిమ్ప్స్ విడుదల చేశారు, ఆ ఫంక్షన్ కి ఆ సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్, అందులో నటిస్తున్న కమల్ హాసన్, రానా దగ్గుబాటి లతో హాజరయ్యాడు. ప్రాజెక్ట్ కె అంటే 'కల్కి 2898 ఎడి' #Kalki2898AD అని రివీల్ చేశారు.

Prabhas-pic.jpg

ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ కి వచ్చేసాడు. అంటే దాదాపు 50 రోజులపాటు ప్రభాస్ ఇండియాలో లేకుండా విదేశాల్లో వున్నాడు. 'ఆదిపురుష్' #Adipurush సినిమా నెగటివ్ ప్రభావం అంతా ఓం రౌత్, ఆ సినిమా రచయిత మనోజ్ ముంతషీర్ (ManojMuntashir) ల మీద బాగా పడింది, వాళ్ళని సాంఘీక మాధ్యమంలో నెటిజన్స్ అయితే ఒక ఆట ఆడుకున్నారు. ప్రభాస్ ఎక్కడా కనిపించకుండా బాగానే తప్పించుకున్నాడు, అని పరిశ్రమలో టాక్ నడిచింది. ఇప్పుడు హైదరాబాద్ వచ్చాడు, ఏమైనా 'ఆదిపురుష్' గురించి కామెంట్ చేస్తాడేమో చూడాలి అని అనుకుంటున్నారు అందరూ. మామూలుగా అయితే తెలుగు నటులు ఎక్కువగా మీడియా ముందుకు రారు, వచ్చినా ఫెయిల్ అయిన సినిమా గురించి అస్సలు మాట్లాడారు. కానీ 'ఆదిపురుష్' సినిమా మీద బాగా నెగటివిటీ వచ్చింది, అలాగే కోర్టులు కూడా ఈ సినిమా నిర్వాహకులకు నోటీసులు ఇచ్చి చాలా ఘాటుగా వ్యాఖ్యానించింది కాబట్టి, ప్రభాస్ ఏమైనా మాట్లాడతారేమో చూడాలి.

ఇప్పుడు మరి 'సలార్' #Salaar షూటింగ్ మొదలెడతాడా, లేదా మారుతీ (DirectorMaruthi) సినిమా చేస్తాడా, ఈ రెండూ కాకుండా 'ప్రాజెక్ట్ కె' షూటింగ్ చేస్తాడా, దేనికి ప్రాధాన్యం ఇస్తాడో చూడాలి.

Updated Date - 2023-07-26T15:46:58+05:30 IST