PriyaBanerjee: అదేంటి ఈ 'రానా నాయుడు' భామ మరీ అంత హాట్ ఫోటోస్ పెట్టేసింది

ABN , First Publish Date - 2023-05-12T18:42:18+05:30 IST

అడివిశేష్ తో మొదటి సినిమా చేసిన ప్రియా బెనర్జీ పేరు ఇప్పుడు మారుమోగుతోంది. అప్పుడప్పుడే చేసిన సినిమా వలన కాదు, ఈమధ్య చేసిన 'రానా నాయుడు' అనే వెబ్ సిరీస్ లో శృంగారంగా నటించినందుకు. మళ్ళీ ఇప్పుడు ఎందుకో తెలుసా...

PriyaBanerjee: అదేంటి ఈ 'రానా నాయుడు' భామ మరీ అంత హాట్ ఫోటోస్ పెట్టేసింది

ఈమధ్య ప్రియా బెనర్జీ (Priya Banejree) పేరు మారు మోగుతోంది, ఎందుకంటే 'రానా నాయుడు' #RanaNaidu వెబ్ సిరీస్ లో చాలా బోల్డ్ గా నటించింది. అలాగే కొన్ని సన్నివేశాల్లో రానాతో (RanaDaggubati) అయితే మరీ పెట్రేగిపోయింది. మనం ఏదైనా ఇంగ్లీష్ వెబ్ సిరీస్ చూస్తున్నామా అన్నంత బోల్డ్ గా నటించింది ఆ వెబ్ సిరీస్ లో. దానితో ఆమె పేరు మారుమోగింది ఒక్కసారిగా. ఇంతకీ ఎవరీ ప్రియా బెనర్జీ అనుకుంటున్నారు.

priyabanerjee.jpg

ఈమె మొట్టమొదటి సినిమా చేసింది తెలుగులోనే, ఇంకెవరితోనో కాదు, మన అడివి శేష్ (AdiviSesh) తో. అడివి శేష్ మొదటి సినిమా 'కిస్' (KISS) తో ప్రియా బెనర్జీ కూడా పరిచయం అయింది. ఈ సినిమాలోకి రాకముందు ఈ బెంగాలీ భామకి టీవిలో ప్రావీణ్యం వుంది. అయితే ఇక్కడ కాదండోయ్ ! కెనడాలో, ఆ తరువాత అక్కడే బ్యూటీ పోటీల్లో కూడా పాల్గొంది. అలాగే అమెరికా లో కూడా టీవీ షోస్ చేసింది.

ఆలా మొట్ట మొదటి తెలుగులో పరిచయం అయినా ఈ ప్రియా బెనర్జీ వరసగా తెలుగు సినిమాలు చేసింది కానీ, మంచి బ్రేక్ అయితే రాలేదు. తరువాత హిందీ ఫిలిం ఇండస్ట్రీ కి వెళ్ళింది, అక్కడ కూడా ఏవో సినిమాలు చేసింది కానీ బ్రేక్ రాలేదు. అలాగే చాలా వెబ్ సిరీస్ లో కూడా వేసింది, తెలుగు వెబ్ సిరీస్ లు రెండు చేసింది కూడా. అందులో '11th అవర్' ఒకటి, ఇందులో తమన్నా (TamannaahBhatia) మెయిన్ లీడ్ చేసింది, ఇంకో వెబ్ సిరీస్ '8 అవర్స్'.

priyabanerjee1.jpg

కానీ ఇప్పుడు బాగా పేరు తెచ్చిన వెబ్ సిరీస్ మాత్రం ఈ సంవత్సరం వచ్చిన 'రానా నాయుడు' అనే చెప్పాలి. దగ్గుబాటి రానా, వెంకటేష్ (VenkateshDaggubati నటించిన ఈ వెబ్ సిరీస్ లో శృంగారం శృతి మించి ఉందని చాలా మంది విమర్శించారు, కానీ ఈ వెబ్ సిరీస్ ఎక్కువమంది చూసారు. అలాంటి శృంగార సన్నివేశాలలో నటించిన ప్రియా బెనర్జీ పేరు మారుమోగింది ఈ వెబ్ సిరీస్ విడుదల కాగానే. అందుకే ఈ వెబ్ సిరీస్ రెండో సీజన్ కూడా వస్తోంది. మరి అందులో ఈమె వుందో లేదో చూడాలి, ఉంటే మొదటి సీజన్ కన్నా డోసు ఎక్కువ చేస్తుందా, తక్కువ చేస్తుందో చూడాలి.

priyabanerjee2.jpg

'రానా నాయుడు' వెబ్ సిరీస్ లో ఎంత శృంగార సన్నివేశాల్లో నటిస్తే మాత్రం, ఇన్స్టాగ్రామ్ (Instagram) లో కూడా అంతే బోల్డ్ గా ఫోటోలు పెట్టింది ఈ అమ్మడు. అయితే అవి ఒంటిమీద నూలుపోగు కూడా లేదు అన్నట్టుగా కనిపించినా, కానీ ఎక్కడో సన్నని బట్ట వేసుకొని, అలా లేనట్టుగా కనపడి కాస్త బోల్డ్ గా ఉంటాయి. అందుకే ఈ అమ్మడి ఫోటోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Updated Date - 2023-05-12T18:42:18+05:30 IST