scorecardresearch

Tiger Sandesam: శ్వాస ఉన్నంత వరకు టైగర్ ఓటమి ఒప్పుకోడు, సల్మాన్ ఖాన్ టైగర్ 3 మూవీ ట్రైలర్

ABN, First Publish Date - 2023-09-27T14:03:50+05:30 IST

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (SalmanKhan), యాష్ రాజ్ ఫిలిమ్స్ (YashRajFilms) తో కలిసి చేస్తున్న 'టైగర్ 3' #Tiger3 విడుదలకి సిద్ధమైంది. ఇది టైగర్ సీక్వెల్ లో మూడో సినిమా. ఇందులో కత్రినా కైఫ్ (KatrinaKaif), ఇమ్రాన్ హష్మీ (EmraanHashmi) కూడా వున్నారు. మనీష్ శర్మ (ManeeshSharma) దర్శకుడు, ఆదిత్య చోప్రా (AdityaChopra) నిర్మాత. యాష్ రాజ్ ఫిలిమ్స్ తీస్తున్న స్పై సినిమాల్లో ఇది అయిదవ చిత్రంగా చెపుతున్నారు. ఈరోజు టైగర్ సందేశం #TigerSandesam అని ఆ సినిమా నుండి ఒక ట్రైలర్ విడుదల చేశారు. ఈ సినిమా హిందీ తో పాటు, తెలుగు, తమిళం భాషల్లో కూడా విడుదలవుతోంది. ఇందులో భారత దేశం తరపున స్పై గా పని చేసిన అవినాష్ సింగ్ రాథోడ్ అలియాస్ టైగర్ మీద అపవాదు వస్తుంది. అతను దేశానికీ వ్యతిరేకంగా పని చేస్తున్నాడు అని అతని ఫోటో, పేరు అన్ని చోట్ల వైరల్ అవుతుంది. అయితే ఆ అపవాదు నిజం కాదు అని చెప్పడానికి టైగర్ ఏమి చేసాడు, ఇంతకీ అది కూడా ప్లాన్ లో భాగమా, లేదా నిజంగానే అతని దేశభక్తిని శంకించాల్సి వచ్చిందా, సినిమా చూస్తే తెలుస్తుంది.

Updated at - 2023-10-27T14:50:28+05:30