Hanuman trailer: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న 'హనుమాన్' ట్రైలర్

ABN, Publish Date - Dec 19 , 2023 | 01:40 PM

తేజ సజ్జ, అమృత అయ్యర్ జంటగా, వరలక్ష్మి శరత్ కుమార్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న 'హనుమాన్' ట్రైలర్ విడుదలైంది. ప్రశాంత్ వర్మ ఈ సినిమాకి దర్శకుడు. ఇది ఒక ఫాంటసీ చిత్రంగా తెరకెక్కింది. జనవరి 12 న విడుదలవుతోంది. తెలుగులోనే కాకుండా, మిగతా భాషల్లో కూడా ఈ సినిమా విడుదలవుతోంది. దీనికి నిరంజన్ రెడ్డి నిర్మాత కాగా, ఈ సినిమాలో ఆ ఫాంటసీ నేపధ్యం పురాణాల్లో చెప్పిన స్వామి హనుమ మీద ఉంటుందని చెపుతున్నారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ అన్నిటిలో ఈ చిత్రం యొక్క దృశ్యాలు ఎంతో అపురూపంగా వున్నాయి. ముఖ్యంగా పర్వతం అంత హనుమంతుడిని చూపించిన విధానం ఎంతో ఆకట్టుకుంటోంది. అలాగే ఈ సినిమాకి జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలు కూడా బాగా ఎక్కువయ్యాయి. మామూలు పల్లెటూరు కుర్రాడు తనకి విశేషమైన బలం వస్తే అధర్మంగా వ్యవహరిస్తున్న కొంతమంది దుష్ట వ్యక్తులను ఎదుర్కొని వాళ్ళకి ఎలాంటి బుద్ధి చెపుతాడు అనేది సినిమా కథా నేపధ్యం. మరి ఇందులో హనుమంతుడిని ఎలా దర్శకుడు చూపించాడు అన్నది ఆసక్తికరం. ప్రత్యక్షంగా చూపించారా, లేదా పరోక్షంగా ఉంటూ కథానాయకుడిని ముందుకు నడిపిస్తారా అన్నది సినిమా విడుదలయ్యాక చూడాల్సిందే.

Updated at - Dec 19 , 2023 | 02:01 PM