Aadikeshava trailer: 'ఆదికేశవ' థియేట్రికల్ ట్రైలర్

ABN, First Publish Date - 2023-11-20T17:56:22+05:30 IST

పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించిన 'ఆదికేశవ' మూవీ ట్రైలర్ ఈరోజు విడుదలైంది. శ్రీకాంత్ రెడ్డి మొదటిసారిగా ఈ సినిమాకి దర్శకత్వం చేస్తుండగా, సితార ఎంటర్ టైనమెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిపి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ట్రైలర్ లో శ్రీలీల, వైష్ణవ తేజ్ మధ్య వచ్చే సన్నివేశాలు యువతని ఆకర్షించే విధంగా వున్నాయి. అలాగే ఇందులో మలయాళం నటుడు జోజూ జార్జి విలన్ గా నటిస్తున్నాడు. రాధిక, సుమన్ లాంటి సీనియర్ నటీనటులు కూడా వున్నారు. ఈ నెల 24న ఈ సినిమా విడుదలవుతోంది. ఇందులోని పాటలు కొన్ని విడుదలయ్యాయి, వైరల్ కూడా అయ్యాయి. శ్రీలీల మరోసారి తన డాన్సు ప్రతిభని ఈ సినిమాలో చూపే అవకాశం వచ్చింది. అలాగే వైష్ణవ్ తేజ్ కూడా ఈ సరి ఒక మాస్ అవతార్ లో కనపడనున్నాడు.