Yash 19 Update : మరో యాక్షన్ ఎంటర్టైనర్ ‘టాక్సిక్‌’'

ABN , First Publish Date - 2023-12-08T11:05:34+05:30 IST

'కేజీఎఫ్‌ ఛాప్టర్‌-2 తర్వాత ఏడాది గ్యాప్‌ ఇచ్చారు  యశ్.  ఆ చిత్రం సక్సెస్‌తో తదుపరి చిత్రం అంచనాలు మించేలా ఉండాలని, ఆచితూచి ఆడుగేయాలని ఆయన ధీటైన కథ కోసం ఎదురుచూశారు.

Yash 19 Update : మరో యాక్షన్ ఎంటర్టైనర్ ‘టాక్సిక్‌’'

'కేజీఎఫ్‌ ఛాప్టర్‌-2 తర్వాత ఏడాది గ్యాప్‌ ఇచ్చారు  యశ్.  ఆ చిత్రం సక్సెస్‌తో తదుపరి చిత్రం అంచనాలు మించేలా ఉండాలని, ఆచితూచి ఆడుగేయాలని ఆయన ధీటైన కథ కోసం ఎదురుచూశారు. తాజాగా తన తదుపరి చిత్రానికి సంబంధించిన బిగ్‌ అప్‌డేట్‌ ఇచ్చారు యశ్. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం 'టాక్సిక్‌’. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కె.వి.ఎన్  ప్రొడక్షన్  సంస్థ నిర్మిస్తోంది, ఈ చిత్రంలో  యశ్ లుక్‌ను, టైటిల్‌ను శుక్రవారం సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు. అంతే కాదు ఈ చిత్రం విడుదల తేదీని కూడా ప్రకటించారు. 2025 ఏప్రిల్‌ పదో తేదీని ఈ చిత్రాన్ని విడుదల చేయబోతునట్లు గ్లింప్స్‌లో తెలియజేశారు. ఇందులో యశ్ ఎలా ఉండబోతున్నారో చూపించారు. తాజాగా విడుదల చేసిన లుక్‌ స్టైలిష్‌గా ఉంది. ఫస్ట్‌ లుక్‌ను బట్టి చూస్తే పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపందునున్నట్లు తెలుస్తోంది. 

Toxic.jpeg

Updated Date - 2023-12-08T12:28:26+05:30 IST