OscarPredictions2023: జూనియర్ ఎన్ఠీఆర్ చరిత్ర సృష్టిస్తాడా

ABN , First Publish Date - 2023-01-05T16:27:48+05:30 IST

వెరైటీ మ్యాగజైన్ ప్రచురించిన టాప్ టెన్ బెస్ట్ యాక్టర్ ప్రిడిక్షన్స్ పేరిట చేసిన దానిలో తెలుగు నటుడు అయిన జూనియర్ ఎన్ఠీఆర్ ఉండటం విశేషం. అసలు ఇంతవరకు తెలుగు నటుడే కాదు, భారత దేశం నుండి ఎవరూ కూడా ఆలా రాలేదు.

OscarPredictions2023: జూనియర్ ఎన్ఠీఆర్ చరిత్ర సృష్టిస్తాడా

అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం లో వచ్చిన 'ఆర్.ఆర్.ఆర్' (#RRR) సినిమా మీదే ఇప్పుడు అందరి కళ్ళూ వున్నాయి. ఈ సినిమా విడుదల అయి చాలా నెలలు అవుతున్నా ఈరోజు వరకు ఈ సినిమా దీనికి పనిచేసిన వాళ్ళూ కూడా వార్తల్లో వున్నారు. ఈ సినిమాని ప్రపంచ స్థాయి కి తీసుకు వెళ్లిన ఘనత రాజమౌళిదే. అక్కడితో ఆగిపోకుండా, రాజమౌళి ఈ సినిమాని ఆస్కార్ బరిలోకి తీసుకెళ్లాలని ఎంతో ప్రయత్నం చేసాడు, ఇంకా చేస్తున్నాడు కూడా. (Rajamouli and his team tried their best to make this film into Oscar Nominations) ఆ ప్రయత్నం ఫలించినట్టుగా ఇప్పుడు 'ఆర్.ఆర్.ఆర్' లో నటించిన జూనియర్ ఎన్ఠీఆర్ (Junior NTR becomes the first Indian actor to feature in Variety's Top 10 Best Actor predictions for Oscars) బెస్ట్ యాక్టర్ కేటగిరీ లో టాప్ టెన్ లో వున్నాడు. అయితే ఆస్కార్ వాళ్ళు చేసినది కాదు. వెరైటీ మ్యాగజైన్ ప్రచురించిన టాప్ టెన్ బెస్ట్ యాక్టర్ ప్రిడిక్షన్స్ పేరిట చేసిన దానిలో తెలుగు నటుడు అయిన జూనియర్ ఎన్ఠీఆర్ ఉండటం విశేషం. అసలు ఇంతవరకు తెలుగు నటుడే కాదు, భారత దేశం నుండి ఎవరూ కూడా ఆలా రాలేదు. జూనియర్ ఎన్ఠీఆర్ ఆలా రావటమే ఒక ఆశ్చర్యకరము, అంటే టీం దీని వెనక ఎంత కష్టపడ్డారో అర్థం అవుతోంది. (OscarPredictions2023)

Jr-NTR2.jpg

ఆస్కార్ నామినేషన్ లో చోటు సంపాదించటం అంత సులువయినా పనేమీ కాదు, దానికి చాలా వర్క్ చెయ్యాలి. రాజమౌళి అతని టీం దీనికోసం అహర్నిశలూ కష్టపడితే, 'ఆర్.ఆర్.ఆర్' కొన్ని కేటగిరీ లలో నామినేషన్స్ కి తీసుకోవచ్చు అని అంటున్నారు. ఈ లెక్కన చూస్తుంటే జూనియర్ ఎన్ఠీఆర్ చరిత్ర ని సృష్టిస్తాడేమో అని కూడా చిత్ర పరిశ్రమలో మాట్లాడుకుంటున్నారు. ఇంతకు ముందు సంగీత దర్శకుడు ఏ.ఆర్. రహమాన్ కి వచ్చినప్పుడు కూడా ఎవరూ అంతలా ఆశించలేదు, కానీ అతని పేరు విన్నర్ అని చదివినపుడు ప్రతి భారతీయుడు సంతోషించారు. అలాగే ఇప్పుడు జూనియర్ ఎన్ఠీఆర్ కూడా ఆస్కార్ అవార్డు (#JrNTROscarNomination) సొంతం చేసుకుంటాడని అందరూ ఆశిస్తున్నారు. ఒకవేళ అతనే గెలిస్తే ఒక్క తెలుగు వాడే కాదు, ప్రతి భారతీయుడు సంతోషించే వార్త అది.

Updated Date - 2023-01-05T16:27:51+05:30 IST