Actress Poorna: నటి పూర్ణ.. రవిబాబు సినిమాల్లోనే ఎందుకు కనిపిస్తోందో తెలిసిపోయిందోచ్..!

ABN , First Publish Date - 2023-04-12T13:20:09+05:30 IST

అల్లరి రవి బాబు నిర్మాతగా 'అసలు' అనే సినిమాతో వస్తున్నాడు. ఇందులో అతనితో పాటు పూర్ణ కూడా నటిస్తోంది. అయితే పూర్ణ ఎక్కువగా రవిబాబు సినిమాల్లోనే కనపడుతుంది. ఎందువల్ల అంటే ఇది చదవండి....

Actress Poorna: నటి పూర్ణ.. రవిబాబు సినిమాల్లోనే ఎందుకు కనిపిస్తోందో తెలిసిపోయిందోచ్..!

అల్లరి రవి బాబు (Allari Ravi Babu) చాలా రోజుల గ్యాప్ తరువాత 'అసలు' (Asalu) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇది ఈటీవీ విన్ (ETV Win) అనే ఓ.టి.టి లో రేపు అంటే ఏప్రిల్ 13న (April 13) విడుదల అవుతోంది. ఈ సినిమాలో అల్లరి రవిబాబు తో పాటు పూర్ణ (Poorna) కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తుంది. ఈ సినిమాకి రవిబాబు రచన, నిర్మాత గా వ్యవహరించారు. ఈ సినిమాని ఉదయ్ అండ్ సురేష్ (Uday and Suresh) ఇద్దరు దర్శకత్వం వహించారు. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా.

actresspoorna2.jpg

"ఇందులో నేను టాస్క్ ఫోర్స్ హెడ్ గా చేస్తున్న. మర్డర్ జరిగినప్పుడు నేను సైకాలాజికల్ గా కూడా ఆలోచిస్తుంటా. మామూలుగా మర్డర్ మిస్టరీ లో ఒక హత్య జరిగితే హంతకుణ్ణి పట్టుకుంటారు, కానీ ఈ సినిమాలో మర్డర్ ఎవరు చేశారు అనే ఒక్క పాయింట్ కాకుండా, ఎందుకు చేసారు, ఎలా చేశారు అనే చాలా కోణాలు కూడా వున్నాయి. ఇదొక ఆసక్తికరంగా వుండే సస్పెన్స్ త్రిల్లర్," అని చెప్పాడు రవిబాబు.

allariravibabu.jpg

ఇందులో పూర్ణ (Poorna) ప్రొఫెసర్ పాత్రలో కనపడుతుంది. ఆమె రవిబాబు కి మర్డర్ మిస్టరీ చేధించటంలో సహాయం చేస్తూ ఉంటుంది. ఆమెకి ఫోరెన్సిక్ లో అనుభవం ఉంటుంది, అందువల్ల ఆమె సహాయం చేస్తుంది. అయితే పూర్ణ ఎక్కువ రవిబాబు సినిమాల్లో కనపడుతూ ఉంటుంది. అందువలన ఎందుకు ఆమె ఇతని సినిమాల్లోనే ఎక్కువ యాక్ట్ చేస్తుంది అనే ఆసక్తికర ప్రశ్న కూడా వస్తూ ఉంటుంది. అదే విషయం రవి బాబుని అడిగితే, అతను నవ్వేసి మంచి నటి ఆమె అని చెప్పాడు.

allariravibabu1.jpg

"పూర్ణ టెర్రిఫిక్ యాక్ట్రెస్. మనం కథ చెప్పినప్పుడు ఆమె కథ వింటునప్పుడే ఆ పాత్రలో లీనం అయిపోతుంది. ఆమె మంచి పెర్ఫార్మర్, ఎటువంటి రోల్ ని అయినా ఐటీ ఆకళింపు చేసుకొని స్క్రీన్ మీద నటించి చూపెడుతుంది. ఆమెలా నటించే వాళ్ళు ఇప్పుడు చాలా తక్కువ వున్నారు. ఇవన్నీ కాకుండా మీ ఎటువంటి భేషజాలకు పోదు, దర్శకుడు ఏమి చెప్తే అది చేసి చూపిస్తుంది. అందువల్లనే ఆమె నా సినిమాల్లో ఎక్కువ కనపడుతుంది, అంతే కానీ మరెటువంటి దేమీ లేదు," అని చెప్పాడు రవిబాబు.

actresspoorna1.jpg

ఈ సినిమా తరువాత సోనీ (Sony) ఛానల్ వాళ్ళకి కూడా ఒక సినిమా చేస్తున్నాను అని చెప్పాడు. ఆ కథ వాషింగ్ మెషిన్ (Washing Machine) చుట్టూ తిరుగుతుంది. అందుకని దానికి 'వాషింగ్ మెషిన్' అని టైటిల్ పెట్టాడు. దాంట్లో వి.కె. నరేష్ (VK Naresh), కమెడియన్ సత్య (Satya), వాషింగ్ మెషిన్ కూడా ఒక పాత్ర పోషిస్తుంది అని చెప్పాడు రవిబాబు. ఈ సినిమా థియేటర్స్ లో కూడా విడుదల అవుతుంది అని చెప్పాడు రవిబాబు. వాషింగ్ మెషిన్ పాత్ర ఏంటి అంటే, సినిమా చూడు బ్రదర్ తెలుస్తుంది, అంతవరకు వెయిట్ చెయ్యి అన్నాడు.

Updated Date - 2023-04-12T13:20:10+05:30 IST