PK: చంటబ్బాయ్ లో చిరంజీవివి మరి నువ్వు... ఇంతకీ ఎవరీ పీకే... పవన్ కళ్యాణ్ కాదు కదా !

ABN , First Publish Date - 2023-07-25T15:24:46+05:30 IST

సంతోష్ శోభన్ లీడ్ యాక్టర్ గా చేస్తున్న ఈ 'ప్రేమ్ కుమార్' ప్రచార చిత్రాలు చాలా ఆసక్తికరంగా వున్నాయి. నటుడిగా బాగా పరిచయం వున్న అభిషేక్ మహర్షి మొదటి సారిగా దర్శకత్వం చేస్తున్న ఈ సినిమా హిలేరియస్ మూవీ గా రానున్నదని అర్థం అవుతోంది. దర్శకుడు అభిషేక్ ప్రచార చిత్రాలలో కూడా కొత్త ఒరవడిని తీసుకొచ్చినట్టుగా కనిపిస్తోంది.

PK: చంటబ్బాయ్ లో చిరంజీవివి మరి నువ్వు... ఇంతకీ ఎవరీ పీకే... పవన్ కళ్యాణ్ కాదు కదా !
A still from Prem Kumar

సంతోష్ శోభన్ (SantoshSobhan) ఈమధ్య చాలా సినిమాలలో లీడ్ యాక్టర్ గా కనిపించాడు, కానీ ఒక్క సినిమా కూడా అతనికి సరైన బ్రేక్ ఇవ్వలేదనే చెప్పాలి. ఇప్పుడు అతను చేస్తున్న 'ప్రేమ్ కుమార్' #PremKumar అనే సినిమా అతనికి ఆ బ్రేక్ ఇస్తుందని అనిపిస్తోంది. ఎందుకంటే ఆ సినిమా ట్రైలర్, ప్రచార చిత్రాలు చూస్తూనే ఈ సినిమాలో విషయం వుంది అనిపిస్తోంది. ఒక హిలేరియస్ కామెడీ సినిమాగా అనిపిస్తోంది. ఈ సినిమాకి అభిషేక్ మహర్షి (AbhishekMaharshi) దర్శకుడు, ఇది అతని మొదటి సినిమా దర్శకుడిగా. అభిషేక్ చాలా సినిమాల్లో నటుడిగా కనిపించి అందరికీ సుపరిచితుడుగా తెలిసిన వాడే. ఈసారి దర్శకత్వం మొదటిసారి చేస్తూ ఈ 'ప్రేమ్ కుమార్' సినిమాతో వస్తున్నాడు.

premkumar2.jpg

ఇందులో సంతోష్ శోభన్, రాశి సింగ్ (RashiSingh) జంటగా వేస్తున్నారు. ఈ సినిమా ప్రచార చిత్రాలు అందరికీ ఆసక్తి కలిగించేలా వున్నాయి. చివరగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది, అది చూసిన తరువాత ఇది ఒక మంచి వినోదాన్ని పంచే సినిమాగా రాబోతోంది అని అర్థం అయిపోతోంది. సంతోష్ శోభన్, అదే ప్రేమ్ కుమార్ అనబడే ఇతనికి పెళ్లిళ్లు ఆగిపోవడంలో ఒక ట్రాక్ రికార్డు వుంది అని చెప్పడంతోటే ఇతని పాత్ర వైవిధ్యంగా వుండబోతోంది అని అర్థం అవుతోంది. సంతోష్ శోభన్ ఇంతవరకు చేసిన సినిమాలకన్నా ఈ సినిమాలో వినోదం పాలు ఎక్కువ ఉండటమే కాకుండా, అతని పాత్ర డిజైన్ చేసే విధానం కూడా బాగుంది అని అర్థం అవుతోంది.

premkumar4.jpg

ఈ మధ్య చాలా చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంటున్నాయి. కంటెంట్ బాగుంది, ప్రేక్షకుల దగ్గరకి తీసుకెళితే చాలు, అది చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా చూస్తున్నారు ప్రేక్షకులు. ఇప్పుడు ఈ 'ప్రేమ్ కుమార్' #PremKumar కూడా అలానే వినోదాల పంటలా కనిపిస్తోంది ట్రైలర్ చూస్తుంటే. దర్శకుడు అభిషేక్ మహర్షి సినిమా మొత్తం నవ్వులు పూయించాడని అర్థం అవుతోంది, అదీ కాకుండా అతని సెన్స్ అఫ్ హ్యూమర్ ఈ సినిమా ప్రచార చిత్రాల్లో బాగా కనిపిస్తోంది. 'మాయాబజార్' సినిమాలోని సీఎస్ఆర్, ముక్కామల చిత్రాలు పెట్టి, 'సుయోధనా ఈ ప్రేమ్ కుమార్ కథ ఏంటి' అని అడగటం, ఆ ప్రియదర్శి చెప్పిన డైలాగ్ చాలా ఆసక్తికరంగా ఉండటం, నవ్వులు తెప్పించటం ప్రచార చిత్రాలు సినిమా మీద ఆసక్తిని పెంచే విధంగా చేసాడు అభిషేక్.

premkumar5.jpg

అలాగే కమెడియన్స్ సుదర్శన్ (Sudarshan), కృష్ణతేజ (KrishnaTeja) టైమింగ్స్ అదిరిపోయేట్టు వున్నాయి ట్రైలర్ లో. సినిమాలో కూడా వీళ్ళిద్దరూ ఇరగదీస్తారని అనిపిస్తోంది. సంతోష్ శోభన్, అదే మన పీకే డిటెక్టివ్ ఏజెన్సీ మొదలెడతారు. పెళ్ళికి ముందు తరువాత వాళ్ళ గురించి తెలిసుకొని, ఆ పెళ్లిళ్లు ఆపడంలో సిద్ధహస్తుడిలా కనిపిస్తున్నాడు. కృష్ణతేజ "మరి నువ్వు 'చంటబ్బాయి' (Chantabbayi) లో చిరంజీవివి మరి" అన్న డైలాగ్ చంటబ్బాయిలో డిటెక్టివ్ చిరంజీవిని (Chiranjeevi) గుర్తు చేసాడు. "పెళ్లిళ్లు అపి ఆపి బోర్ కొట్టిందిరా, ఈసారి జరిపిద్దాం" ఇలాంటి చిన్న చిన్న డైలాగ్స్ బాగున్నాయి. మొత్తానికి ఈ సినిమాల సంతోష్ శోభన్ చేస్తున్న 'ప్రేమ్ కుమార్' పాత్రని 'పీకే' గా బాగానే ప్రచారం చేశారు. పీకే అంటే పవన్ కళ్యాణ్ (PawanKalyan) అని కూడా అంటారు కదా, అది ఈ సినిమాకి బాగా ఉపయోగం అవుతుందేమో మరి. పీకే అంటే పవన్ కళ్యాణ్ కాదండీ ... ప్రేమ్ కుమార్ ! ఆగష్టు 18న విడుదల అవుతోంది ఈ సినిమా.

Updated Date - 2023-07-25T15:24:46+05:30 IST