NaatuNaatu: ఆస్కార్ వేదికపై 'నాటు నాటు' గురించి దీపికా ఆ మాట అనగానే, పగలబడి నవ్వేశారు !

ABN , First Publish Date - 2023-03-13T13:56:15+05:30 IST

'నాటు' అంటే మీకు తెలుసా, తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి అంటున్న దీపికా ఏమి చెప్పిందో, ఎలా చెప్పిందో చూడండి..

NaatuNaatu: ఆస్కార్ వేదికపై 'నాటు నాటు' గురించి దీపికా ఆ మాట అనగానే, పగలబడి నవ్వేశారు !

ఈసారి ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం లో భారతీయులకి ఇంకో సంతోషకరమైన విషయం కూడా వుంది. భారతీయ సినిమాలు (Oscars95) రెండింటికి 'ఆర్.ఆర్.ఆర్' (RRR), 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' (The Elephant Whisperers), అవార్డులు రావటమే కాకుండా, బాలీవుడ్ అగ్రనటీమణుల్లో ఒకరుగా చలామణి అవుతున్న దీపికా పడుకునే (Deepika Padukone) ప్రెజంటర్ గా (Presenter) వచ్చారు. ఆమె 'నాటు నాటు' (NaatuNaatu) పాట గురించి చెపుతూ అది ఎలా వుంది, సినిమాలో ఎక్కడ వుంది అన్న విషయాలు కూడా చెప్పారు. ఆమె 'ఆర్.ఆర్.ఆర్' (RRR) అనగానే చప్పట్లతో మారుమోగింది హాలు, తరువాత 'నాటు నాటు' (NaatuNaatu) అనే మాటలు ఆమె నోటివెంట రాగానే, ఇంక హాలు మొత్తం హోరెత్తింది.

deepikapadukone2.jpg

"ఈ పాట ఒక ముఖ్యమైన సన్నివేశం లో వచ్చింది. ఈ సినిమా స్నేహం ఆధారంగా, ముఖ్యంగా ఇద్దరు రియల్ లైఫ్ వ్యక్తులు విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు (Alluri Seetharamaraju), కొమరం భీం (Komaram Bheem) మధ్య నడిచింది. ఈ పాటని తెలుగులో పాడటమే కాకుండా, వలసవాద వ్యతిరేక ఉద్యమానికి నాందిగా ఇది ఉర్రూతలూగించింది. ఈ పాటకి మిలియన్స్ కొద్దీ వ్యూస్ యూట్యూబ్ (Youtube)లోనూ, టిక్ టాక్ (TikTok) లోనూ, ఆలాగే ఈ పాటకి ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో ప్రేక్షకులు లేచి డాన్స్ చేశారు కూడా. అలాగే ఇది మొదటి ఇండియన్ ప్రొడక్షన్ కంపెనీ నుండి ఆస్కార్ కి నామినేట్ అయిన మొదటి పాట," అని చెప్పగానే ఒక్క నిముషం పాటు ఆమెని మరేమీ మాట్లాడ నీయకుండా హాలంతా చప్పట్లతో మారుమోగింది.

deepikapadukone3.jpg

చప్పట్లు ఆగకుండా కొడుతూనే ఉండగా, మళ్ళీ దీపికా తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ, "నాటు అంటే మీకు తెలుసా". అని అడిగింది. "ఒకవేళ మీకు తెలియకపోతే, ఇప్పుడు తెలుసుకుంటారు," అంటూ ఇప్పుడు 'ఆర్.ఆర్.ఆర్' సినిమా నుండి 'నాటు నాటు' పాటా చూస్తూ వింటారు అనింది దీపికా. హాలు హాలంతా ఒక్కసారిగా చప్పట్లతో మారుమోగడమే కాకుండా, అక్కడ ఒక తెలియని ఉద్వేగభరితమయిన వాతావరణం చోటుచేసుకుందని చెప్పొచ్చు.

ఈ దీపికా పడుకొనే ప్రసంగాన్ని ప్రముఖ బిజినెస్ మాన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ట్వీట్ చేశారు. ఆ పాటని ఎంతో ప్రైస్ చేస్తూ, ఇది ఒక మినీ మూవీ గా అభివర్ణించారు ఆనంద్ మహీంద్రా. అలాగే రాజమౌళి కి తలవంచి వందనం అని చెప్పారు.

Updated Date - 2023-03-13T13:56:17+05:30 IST