scorecardresearch

NTR30: ఎన్టీఆర్ అభిమానులు అమెరికాలో ఎంత పని చేశారో చూడండి...

ABN , First Publish Date - 2023-03-20T12:11:20+05:30 IST

ఎన్టీఆర్, ఇప్పుడు ఈ పేరు ప్రపంచం అంతా మారుమోగుతోంది. తెలుగు సినిమా పరిశ్రమ పతాకాన్ని ఆస్కార్ అవార్డు ఫంక్షన్ లో ఎగరేయటమే కాకుండా, టైగర్ అంటే పులి, అందుకనే పులి బొమ్మ వున్న అవుట్ ఫిట్ వేసుకొని ఆస్కార్ ఫంక్షన్ కి హాజరయ్యాడు ఎన్టీఆర్. అలాగే అమెరికాలో విపరీతమయిన క్రేజ్, ఇంకా కొత్త అభిమానులని కూడా సంపాదించాడు. అమెరికా లో అభిమానులు తమ కథానాయకుడి కోసం ఏమి చేశారో చూడండి

NTR30: ఎన్టీఆర్ అభిమానులు అమెరికాలో ఎంత పని చేశారో చూడండి...

'ఆర్.ఆర్.ఆర్' (RRR) సినిమాలో 'నాటు నాటు' (Naatu Naatu) పాటకి ఆస్కార్ అవార్డు (Oscar Award) రావటం తో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) మార్కెట్ తెలుగు రాష్ట్రాల నుండి, భారత దేశం మొత్తం కాకుండా, ఇప్పుడు ప్రపంచం అంతా అతని పేరు వినబడుతోంది. ఆ అవార్డు రావటానికి ఎన్టీఆర్ కొన్ని రోజుల ముందుగానే అమెరికా (America) వెళ్లి అక్కడ విశేషమయిన ప్రచారం చేశాడు (Oscars95). అందరి మనస్సులో బాగా నాటుకునేట్టు 'నాటు నాటు' పాటకి ప్రాచుర్యం సంపాదించి పెట్టాడు ఎన్టీఆర్.

NTR-koratalasiva.jpg

అయితే అక్కడి అభిమానులను కూడా ఎన్టీఆర్ కలిసి అందరితో మాట్లాడి వీలయినంత మందికి ఫోటో కోసం ఫోజులిచ్చి అందరినీ సంతోష పరిచాడు ఎన్టీఆర్. ఇప్పుడు అమెరికా లో ఇంకా ఎక్కువ అభిమానులను సంపాదించుకున్నాడు ఎన్టీఆర్. అందుకే అతని రాబోయే సినిమా #NTR30 దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) తో ఎప్పుడు షూటింగ్ జరుగుతుందా, ఎప్పుడు పూర్తవుతుందా, ఎప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు అందరూ ఎదురు చూస్తున్నారు.

ntrusafans.jpg

అయితే ఈలోగా అమెరికా లోని ఎన్టీఆర్ అభిమానులు తమ కథానాయకుడు అమెరికా వచ్చి అందరిని కలిసినందుకు ధన్యవాదాలు చెప్పలేను అనుకున్నారు. అందుకని ఒక పెద్ద ప్లాన్ వేశారు. ఎప్పుడు కానీ విని ఎరుగని రీతిలో విమానానికి వెనకాల తోకలా 'థేంక్ యు ఎన్టీఆర్, #NTR30 కోసం ఎదురు చూస్తున్నాం' (Thank you NTR. Can't wait for #NTR30) అని రాసిన అక్షరాలూ ఆకాశం లో మెరుస్తూ అందరినీ అలరించాయి.

ntrfansusa.jpg

ఈమధ్య కాలం లో ఇంతగా ఏ నటుడికీ అమెరికా లో ఇంతగా స్వాగతం పలకలేదు, రాలేదు కూడా. ఎన్టీఆర్ అక్కడ అభిమానులను అంతగా అలరించారు అనడానికి ఈ ఒక్క నిదర్శనం చాలు.

Updated Date - 2023-03-20T13:02:10+05:30 IST