Mahesh Babu: అభిమానులకు పుట్టినరోజు కానుక ఏంటి?

ABN , First Publish Date - 2023-08-06T10:49:29+05:30 IST

మహేష్‌ బాబు పుట్టిన రోజున ఆయన సినిమాకు సంబంధించిన ఏదో ఒక ట్రీట్‌ ఇస్తుంటాను. ఈ నెల 9న ఆయన పుట్టినరోజు. ఎలాంటి సర్‌ప్రైజ్‌ ఇస్తారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న ‘గుంటూరు కారం’ షూటింగ్‌లో ఉంది. పైప్‌లైన్‌లో రాజమౌళి సినిమా ఉంది. కాబట్టి ఆ సినిమాకు సంబంధించి అప్‌డేట్‌ వచ్చే అవకాశం లేదు.

Mahesh Babu: అభిమానులకు పుట్టినరోజు కానుక ఏంటి?

మహేష్‌ బాబు(Maheshbabu) పుట్టిన రోజున ఆయన సినిమాకు సంబంధించిన ఏదో ఒక ట్రీట్‌ ఇస్తుంటాను. ఈ నెల 9న ఆయన పుట్టినరోజు. ఎలాంటి సర్‌ప్రైజ్‌ ఇస్తారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న ‘గుంటూరు కారం’(Guntur Karam) షూటింగ్‌లో ఉంది. పైప్‌లైన్‌లో రాజమౌళి సినిమా ఉంది. కాబట్టి ఆ సినిమాకు సంబంధించి అప్‌డేట్‌ వచ్చే అవకాశం లేదు. తాజా చిత్రం ‘గుంటూరు కారం’ చిత్రం నుంచే స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ బర్త్‌డే కానుకగా ఓ పాట వదులుతారని ఆశిస్తున్నారు అభిమానులు. ఇప్పటికే తమన్‌ పాటని సిద్ధం చేశారట. కాకపోతే.. ఆ ట్యూన్స్‌ విషయంలో మహేష్‌ ఇప్పటికీ అసంతృప్తితోనే ఉన్నాడని టాక్‌ వినిపిస్తోంది. తమన్‌ ఇప్పటికే కొన్ని ట్యూన్లు పంపాడు. మహేష్‌ ఏదీ ఓకే చేయలేదట. దీన్ని బట్టి చూస్తే మహేశ్‌ పుట్టినరోజున పాట వచ్చే అవకాశం అంతంత మాత్రంగానే కనిపిస్తుంది. అలాంటి హడావిడే కనుక ఉంటే ఇప్పటికే చిత్ర బృందం సర్‌ప్రైజ్‌ అంటూ సోషల్‌ మీడయాలో సందడి చేసేది. (Birthday Gift)

ఒకవేళ పాట రెడీ కాకపోతే.. ఏం చేయాలి? అనే విషయంలో కూడా చిత్రబృందం దగ్గర మరో ప్లాన్‌ ఉందని సినీ వర్గాల నుంచి సమాచారం. ఓ చిన్న సైజు టీజర్‌ని వదిలితే బాగుంటుందని ఫిక్సయి, ఆ దిశగానూ ప్రయత్నాలు చేస్తున్నారట. కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌ గ్లింప్స్‌ ఫుల్‌ మాస్‌గా ఉంది. ఈసారి కాస్త క్లాస్‌ టచ్‌ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు.

Updated Date - 2023-08-06T10:49:29+05:30 IST