నీ కనులలో ఏమున్నదో...!
ABN, First Publish Date - 2023-07-14T22:59:45+05:30
నరేశ్ అగస్త్య, సంగీర్తన జంటగా నటించిన చిత్రం ‘అసురగణ రుద్ర’. మురళీ కాట్రగడ్డ దర్శకుడు. మురళీ వంశీ నిర్మాత....
నరేశ్ అగస్త్య, సంగీర్తన జంటగా నటించిన చిత్రం ‘అసురగణ రుద్ర’. మురళీ కాట్రగడ్డ దర్శకుడు. మురళీ వంశీ నిర్మాత. ఈ చిత్రం నుంచి ‘నీ కనులలో’ అనే పాటని శుక్రవారం విడుదల చేశారు. శేఖర్ చంద్ర స్వరాలు సమకూర్చారు. సిద్దార్థ్ మీనన్ ఆలపించారు. నికేశ్ కుమార్ సాహిత్యం అందించారు. ‘‘శేఖర్ చంద్ర మెలోడీలకు పెట్టింది పేరు. ఆయన అందించిన మరో మంచి బాణీ ఇది. పాటలో హీరో, హీరోయున్ల కెమిస్ర్టీ ఆకట్టుకొంటుంద’’ని దర్శకుడు తెలిపారు.