రూమర్స్‌ ఏం చేశాయి?

ABN , First Publish Date - 2023-09-02T00:13:27+05:30 IST

పరుచూరి సుదర్శన్‌, శ్రీ హీరో హీరోయిన్లుగా ఆర్‌. పి సినిమాస్‌ బేనర్‌పై ఓ చిత్రం రూపొందుతోంది. ఆమని, నాజర్‌, రఘుబాబు, పృథ్విరాజ్‌, సప్తగిరి కీలకపాత్రలు పోషిస్తున్నారు.....

రూమర్స్‌ ఏం చేశాయి?

పరుచూరి సుదర్శన్‌, శ్రీ హీరో హీరోయిన్లుగా ఆర్‌. పి సినిమాస్‌ బేనర్‌పై ఓ చిత్రం రూపొందుతోంది. ఆమని, నాజర్‌, రఘుబాబు, పృథ్విరాజ్‌, సప్తగిరి కీలకపాత్రలు పోషిస్తున్నారు. రవికిషోర్‌ బాబు చందిన దర్శకత్వంలో ఎన్‌. పాండురంగారావు, చిన్న రెడ్డయ్య కోయ నిర్మిస్తున్నారు. ఇటీవలె చిత్రీకరణ పూర్తయింది. సుదర్శన్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఫస్ట్‌లుక్‌, బర్త్‌డే గ్లింప్స్‌ను యూనిట్‌ విడుదల చేసింది. డిఫరెంట్‌ లుక్స్‌తో ఉన్న పోస్టర్స్‌ సినిమాపై అంచనాలు పెంచాయి. త్వరలో టైటిల్‌ను ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు. రూమర్స్‌ వల్ల కొందరి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి అనే పాయింట్‌ చుట్టూ అల్లుకున్న కథ ఇదని దర్శకుడు చెప్పారు. కామెడీ థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్‌ డైలాగ్స్‌ అందిస్తున్నారు. సంగీతం: వినోద్‌ యాజమాన్య, సినిమాటోగ్రఫీ: శివకుమార్‌ దేవరకొండ

Updated Date - 2023-09-02T00:13:27+05:30 IST