BroTheAvatar: ఇంత వర్షాల్లోనూ ఎంత కలెక్టు చేసిందో తెలుసా...

ABN , First Publish Date - 2023-07-31T17:29:05+05:30 IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పవర్, స్టామినా ఏంటో మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించారు. డివైడ్ టాక్, యావరేజ్ టాక్ అనీ ఇలా చాలామంది అనుకుంటూ వుంటారు కానీ, ఆ నంబర్స్ చూస్తుంటే మాత్రం పవన్ కళ్యాణ్ ఇంకో బ్లాక్ బస్టర్ సినిమా కొట్టి మొత్తం హాట్రిక్ విజయాలను నమోదు చేసుకున్నారు అని తెలుస్తోంది. ఈ మూడు రోజుల కలెక్షన్స్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది.

BroTheAvatar: ఇంత వర్షాల్లోనూ ఎంత కలెక్టు చేసిందో తెలుసా...
Bro The Avatar

పవన్ కళ్యాణ్ (PawanKalyan), అతని మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (SaiDharamTej) నటించిన 'బ్రో' #BroTheAvatar గత శుక్రవారం థియేటర్స్ లో విడుదలైంది. అయితే గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైన వర్షాలు, వరదలు వచ్చాయి. ఇటువంటి సమయంలో #Bro ఈ సినిమా ఏమి ఆడుతుంది అని అందరూ అనుకున్నారు. అదీ కాకుండా, సినిమాకి బజ్ లేదు, ప్రచారం లేదు, ఇలాంటివి ఏవేవో కూడా అన్నారు. సినిమా మీద ఏమీ అంచనాలు లేవు అన్నారు.

కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఇవన్నీ అవసరం లేదు. అతని సినిమా విడుదలవుతోంది అంటే అభిమానులకి పండగే. సినిమాలో దమ్ము లేదు అన్నారు, మిక్సెడ్ టాక్ అన్నారు, అయితే ప్రేక్షకులు ఇవేమీ పట్టించుకోలేదు అని తెలిసింది. వరదలు, వర్షాలు వచ్చిన పవర్ స్టార్ సినిమాకి మాత్రం ప్రేక్షకులు మిస్ అవ్వకూడదు అనుకున్నారేమో అందుకే ఈ సినిమా మూడు రోజుల కలెక్షన్స్ చూస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది.

bro3.jpg

సముద్రఖని (Samuthirakani) దర్శకత్వం వహించిన, ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ (TrivikramSrinivas) మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. ఇందులో వింటేజ్ పవన్ కళ్యాణ్ సన్నివేశాలు అదిరిపోయాయి అంటున్నారు. అలాగే కొన్ని మాటలు అయితే జీవిత సత్యాలని చెప్పేవిగా ఉన్నాయని అంటున్నారు. ఇంతకీ ఈ మూడు రోజులకు గాను ఎంత కలెక్టు చేసిందో తెలుసా? మూడు రోజులకు గాను సుమారు రూ 55 కోట్ల వరకు షేర్ (Rs 55 crore share) ప్రపంచవ్యాప్తగా వచ్చింది అని అంటున్నారు. ఇందులో ఒక్క నైజాంలోనే సుమారు రూ 18 కోట్లు (Rs 18 crore Nizam share) వరకు కలెక్టు చేసిందని అంటున్నారు. అలాగే ఈ సినిమా ధియేటరికల్ హక్కులు సుమారు రూ 95 కోట్లు వరకు అమ్మారని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు. అంటే సుమారు 60 శాతం ఈ మూడు రోజుల్లో రికవరీ అయినట్టే అని కూడా అంటున్నారు.

ఒక యావరేజ్ సినిమా, డివైడ్ టాక్ ఇవన్నీ కొంతమంది అనుకున్న మాటలు, కానీ పవన్ కళ్యాణ్ 'బ్రో' సినిమాకి ఇవన్నీ వర్తించవు. అతని

అభిమానులకి చాలా రోజుల తరువాత పవన్ కళ్యాణ్ ని ఎలా చూడాలని అనుకుంటున్నారో ఇందులో ఆలా చూపించారని అందుకే ఈ సినిమా బాగా ఎక్కేసింది అని అంటున్నారు. లేకపోతే మొదటి రోజే తేలిపోయేది సినిమా, కానీ రెండో రోజు, మూడో రోజు కలెక్షన్స్ మొదటి రోజు కన్నా ఎక్కువ వచ్చాయి అంటే ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని అంటున్నారు. ఈ సోమవారం నుండి కలెక్షన్స్ ఎలా వుంటాయో చూడాలి అని, అప్పుడు ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పగలరు అని అనలిస్ట్స్ అంటున్నారు.

Updated Date - 2023-07-31T17:29:05+05:30 IST