Megastar chiranjeevi: పవన్‌కల్యాణ్‌ని ఊహించుకుని చేశా.. అందుకే... అంతలా...

ABN , First Publish Date - 2023-01-29T14:53:21+05:30 IST

వాల్తేరు వీరయ్య’ చిత్రీకరణ దశలో ఉండగానే పెద్ద హిట్‌ అవుతుందని అంతా నమ్మాం. కానీ నాన్‌ ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాల స?్థయికి వెళ్తుందని ఊహించలేదు. ప్రేక్షకులు, అభిమానుల ఆదరణ వల్లే ఇదంతా సాధ్యమైంది.

Megastar chiranjeevi: పవన్‌కల్యాణ్‌ని ఊహించుకుని చేశా.. అందుకే... అంతలా...

‘వాల్తేరు వీరయ్య’ (waltair veerayya) చిత్రీకరణ దశలో ఉండగానే పెద్ద హిట్‌ అవుతుందని అంతా నమ్మాం. కానీ నాన్‌ ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాల స్థాయికి వెళ్తుందని ఊహించలేదు. ప్రేక్షకులు, అభిమానుల ఆదరణ వల్లే ఇదంతా సాధ్యమైంది. ఇలాంటి విజయం అందుకోవడం సామాన్య విషయం కాదు’’ అని మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi)అన్నారు. బాబీ దర్శకత్వంలో చిరంజీవి, రవితేజ కలిసి నటించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై రూ. 250 కోట్లకు(250 crores) పైగా వసూళ్లు రాబట్టింది. ఈ నేపథ్యంలో హన్మకొండలో (hanmakonda)శనివారం రాత్రి ‘వీరయ్య విజయ విహారం’ పేరుతో సక్సెస్‌ వేడుక నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి యర్రబెల్లి దయాకర్‌ చిత్ర బృందానికి షీల్డులు అందించారు. (waltair veerayya success party)

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా సక్సెస్‌కి ముఖ్యకారణం దర్శకుడు బాబీ. ఆయన తండ్రి తనకు నాపై ఉన్న ప్రేమను ఎలా నూరిపోశాడో.. ఈ చిత్రంతో చూపించాడు. తను తెరకెక్కించిన తీరు చూసి నేనే అతనికి అభిమానినైపోయా. రూ. 250 కోట్లు వసూలు చేసిందంటే ఇది ఎంతటి విజయమో అర్థమవుతోంది. రవితేజను చూస్తే నాకు మరో పవన్‌ కల్యాణ్‌లా కనిపిస్తాడు. అందుకే తనపై నాకంత సోదరభావం ఉంటుంది. సినిమాలో తన పాత్ర చనిపోయే సన్నివేశాన్ని పవన్‌ను ఊహించుకొని చేశా. అందుకే ఆ సన్నివేశం అంత భావోద్వేగంగా వచ్చింది’’ అని అన్నారు.

3.jpg

చరణ్‌కు అవార్డు రాకపోయినా అంతకు మించిన ఆదరణ...(Ram charan)

‘రంగస్థలం’ సినిమాలో రామ్‌చరణ్‌ ఎక్కడా కనిపించడు. చిట్టిబాబు పాత్రే కనిపిస్తుంది. ఇప్పటికీ ప్రతి ఒక్కరూ ఆ పాత్ర గురించి మాట్లాడుతుంటారు. చరణ్‌కు ఇప్పటికీ జాతీయ అవార్డులు రాకపోవచ్చు కానీ, ప్రతి ఒక్కరూ ఆ చిట్టిబాబు పాత్ర గురించి మాట్లాడుకుంటున్నారంటే దాని ప్రభావమెంతో అర్థం చేసుకోవచ్చు. ఎన్ని జాతీయ అవార్డులొేస్త దానికి దీటుగా ఉంటుంది.

దేశానికి గర్వకారణమైన విషయమిది...(RRR-Oscar)

‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో చరణ్‌ విశ్వరూపం చూపించాడు. అలాగే ఎన్టీఆర్‌ కూడా. ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌.. రాజమౌళి, చరణ్‌, తారక్‌, కీరవాణి, చంద్రబోస్‌, ప్రేమ్‌ రక్షిత్‌ అందరూ కలిసి చేసిన ‘నాటు నాటు’ పాట గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు అందుకోవడమే కాక.. ఆస్కార్‌ నామినేషన్‌ దాకా వెళ్లిందంటే ఇంత కంటే గర్వకారణం మన తెలునిగు వాళ్లకు ఏముంటుంది. నిజంగా చరణ్‌ స్థానంలో నేనే ఉన్నంత గర్వంగా అనిపిస్తోంది. దేశానికి గర్వకారణమైన విషయమిది.

దర్శకుడు బాబీ మాట్లాడుతూ.. ‘‘ఇంత పెద్ద విజయం అందించిన ప్రేక్షకులకి ఏమియ్యి రుణం తీర్చుకోగలం. ప్రతి ఒక్కరికీ పేరేపేరున కృతజ్ఞతలు. సినిమా విజయం సాధించాక ఇదెన్ని వందల కోట్లు సాధిస్తుందో నేను ఊహించలేదు. కానీ, ఇరవై రోజుల ముందే చిరంజీవి ఇచ్చిన జడ్జిమెంట్‌తో ఈ సినిమా ఎంత బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతుందో అర్థమైపోయింది. నాన్న మరణించడానికి 4 నెలల ముందు చిరంజీవి ఆయన్ని ఇంటికి పిలిపించారు. ఈరోజు సాధించిన ఫలితాన్ని ఆరోజే ఊహించి నాన్నకు చెప్పి, ఆయన్ని సంతృప్తిగా పంపించారు. అప్పటికి 30 శాతం చిత్రీకరణే పూర్తయింది. నేనిప్పటి వరకు నాలుగు సినిమాలు చేశాను. కానీ, ఈ చిత్ర విజయంతో అందుకుంటున్న గొప్ప గౌరవాన్ని ఎప్పుడూ పొందలేదు’’ అన్నారు.

2.jpg

Updated Date - 2023-01-29T14:53:22+05:30 IST