Muttiah Muralitharan : ఆ టీమ్‌కు వెంకటేశ్‌ కెప్టెన్‌ అవుతారు!

ABN , First Publish Date - 2023-09-26T11:02:50+05:30 IST

శ్రీలంక క్రికెటర్‌ క్రికెటర్‌, ప్రఖ్యాత స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘800’. మురళీ పాత్రలో మధుర్‌ మిట్టల్‌ నటించగా, ఆయన భార్య మదిమలర్‌ పాత్రలో మహిమా నంబియార్‌ నటించారు. ఎం.ఎస్‌.శ్రీపతి దర్శకత్వం వహించారు.

Muttiah Muralitharan : ఆ టీమ్‌కు వెంకటేశ్‌ కెప్టెన్‌ అవుతారు!

శ్రీలంక క్రికెటర్‌ క్రికెటర్‌, ప్రఖ్యాత స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘800’. మురళీ పాత్రలో మధుర్‌ మిట్టల్‌ నటించగా, ఆయన భార్య మదిమలర్‌ పాత్రలో మహిమా నంబియార్‌ నటించారు. ఎం.ఎస్‌.శ్రీపతి దర్శకత్వం వహించారు. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ సమర్పణలో ఈ చిత్రం అక్టోబరు 6న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకకు వీవీఎస్‌ లక్ష్మణ్‌ అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ‘‘ముత్తయ్య మురళీధరన్‌ క్రికెటర్‌గానే కాదు... వ్యక్తిగా కూడా ఎంతో స్ఫూర్తిదాయకం. జీవితంలో ఎన్నో సవాళ్లుని ఎదుర్కొని ఎదిగాడు. యువతరానికి తనెంతో ఆదర్శం. ఆయన జీవితం ఆధారంగా తీసిన ‘800’ తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. ఈ సినిమాలో ఆయన పాత్ర చేసిన మధుర్‌ మిట్టర్‌ తెరపై నేచురల్‌గా కనిపించాడు’’ అని అన్నారు. ఇక మా ఇద్దరి అనుబంఽధం విషయానికి వస్తే మురళీ, నేను కలిసి ఓ జట్టులో ఆడాం. వేర్వేరు జట్లలోనూ ఆడాం. మైదానంలో ఆటే ప్రపంచంగా ఎంత గాఢతతో ఆడతాడో.. ఆట పూర్తయిన తర్వాత అంతే సరదాగా ఉంటాడు. తాను నాకు సోదరుడి కంటే ఎక్కువ. తను శ్రీలంకకి ఆడినా, ఇతర జట్టుకి ఆడినా మైదానంలో ఆటపై అంత ఏకాగ్రత, నిబద్థత ఉండేది. ప్రపంచంలోని డొమెస్టిక్‌ క్రికెట్‌ గురించి కూడా తనకి గొప్ప అవగాహన ఉంది. ఆటే తన ప్రపంచం. తనను మిస్టర్‌ క్రికెట్‌ అంటాను. సునామీ వచ్చినప్పుడు, ఇతర సందర్భాల్లో తన ఫౌండేషన్‌ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు’’ అని అన్నారు.

మురళీధరన్‌ ముత్తయ్య మాట్లాడుతూ ‘‘నేను సినిమాల్ని బాగా ఇష్టపడతా. భారతీయ సినిమాలు చాలా చూశా. అయితే నా లైఫ్‌స్టోరీతో సినిమా అనగానే అంతగా ఇష్టపడలేదు. దర్శకుడు వెంకట్‌ ప్రభు పట్టుబట్టి ఈ సినిమాకి ఒప్పించారు. దర్శకుడు రెండేళ్లు నా జీవితంపై పరిశోధన చేసి ఈ స్ర్కిప్ట్‌ రాసుకున్నాడు. నాకు ఇచ్చిన మాట ప్రకారం వాస్తవాల్ని మాత్రమే తెరపైకి తీసుకొచ్చాడు. క్రికెట్‌ అనే కాదు, ఇతర ఏ క్రీడల్లోనైనా, ఇతర రంగాల్లో ఉన్నవాళ్లకేౖనా ఈ సినిమా స్ఫూర్తినిచ్చేలా ఉంటుంది’’ అన్నారు.

హైదరాబాద్‌తో తనకున్న అనుబంధం గురించి చెబుతూ ‘‘తెలుగు భాష.. సింహళీకి దగ్గరగా ఉంటుంది. ఎవరైనా తెలుగు మాట్లాడితే నాకు చాలా వరకూ అర్థం అవుతుంది. హైదరాబాద్‌ నగరం నాకు ఎంతో ప్రత్యేకం. ఇక్కడుంటే... శ్రీలంకలో ఉన్నట్టే ఉంటుంది. అప్పట్లో హైదరాబాద్‌ చాలా ప్రశాంతంగా, ఓ చిన్న నగరంలా కనిపించేది. కానీ ఇప్పుడు బాగా మారింది. గొప్పగా అభివృద్థి చెందుతోంది’’ అన్నారు.

తెలుగులో రాజకీయ నాయకులు, సినిమా తారలతో కలిసి ఓ జట్టుని ఏర్పాటు చేేస్త అందులో ఎవరెవరు ఉంటారన్న ప్రశ్నకి ‘‘ఆ జట్టుకి హీరో వెంకటేశ్‌ కెప్టెన్‌ అవుతారు. ఎన్టీఆర్‌, ప్రభాస్‌ వంటి స్టార్స్‌ ఆ జట్టులో ఉంటారు నాకు రాజకీయ నాయకులతో నాకు అంతగా పరిచయాలు లేవు. నేను ఓ సందర్భంలో హీరో నానితో ఫోన్‌లో మాట్లాడాను. తను నటించిన ‘జెర్సీ’ చూశా. తన సినిమాలంటే నాకు చాలా ఇష్టం’’ అని మురళీధరన్‌ అన్నారు.

Updated Date - 2023-09-26T12:31:25+05:30 IST