Pavithra Naresh: వివాహ వ్యవస్థ గురించి నరేశ్‌ ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2023-05-19T18:46:50+05:30 IST

సీనియర్‌ నటుడు వి.కె.నరేశ్‌, పవ్రితా లోకేష్‌ల మఽధ్యనున్న అనుబంధం గురించి తెలిసిందే! వీరిద్దరూ చాలాకాలంగా కలిసే ఉంటున్నారు. తాజాగా పవిత్రా నరేశ్‌ కలిసి ‘మళ్లీ పెళ్లి’ అనే సినిమాలో నటిస్తున్నారు.

Pavithra Naresh: వివాహ వ్యవస్థ గురించి నరేశ్‌ ఏమన్నారంటే..

సీనియర్‌ నటుడు వి.కె.నరేశ్‌(Vk NAresh), పవ్రితా లోకేష్‌ల(pavithra lokesh) మధ్యనున్న అనుబంధం గురించి తెలిసిందే! వీరిద్దరూ చాలాకాలంగా కలిసే ఉంటున్నారు. తాజాగా పవిత్రా నరేశ్‌ కలిసి ‘మళ్లీ పెళ్లి’ (malli pelli)అనే సినిమాలో నటిస్తున్నారు. ఎం.ఎస్‌.రాజు దర్శకత్వంలో విజయ కృష్ణ బ్యానర్‌పై నరేశ్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు కన్నడలో ఈ సినిమా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా బెంగళూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నరేశ్‌ పవిత్రతో ఉన్న బంధం గురించి స్పష్టతనిచ్చారు. పెళ్లి మీద ఉన్న అభిప్రాయాన్ని వెల్లడించారు.

‘‘ఈ మధ్యకాలంలో మేమిద్దరం కలిసి ఎక్కడ కనిపించినా పవిత్రా లోకేశ్‌ను పెళ్లి చేసుకుంటారా?’ అని ఈ మీడియా ప్రశ్నిస్తోంది. ‘అసలు వివాహం అంటే ఏంటి?’ తాళి కట్టడం, ఉంగరం మార్చుకోవడం వివాహమా? ఇవన్నీ మన మత, సంప్రదాయల కోసం పెట్టుకున్న గుర్తులు. వివాహం అంటే రెండు హృదయాలు కలవడం. మా మనసులు ఎప్పుడో కలిశాయి. ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాం. ఈ విషయాన్నే నేను స్పష్టం చేయాలనుకున్నా. అదే సమయంలో వివాహ వ్యవస్థ అంటే మాకెంతో గౌరవం. ప్రపంచం మారుతోంది. ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే చాలా పెద్ద సబ్జెక్ట్‌ అవుతుంది. అందరూ మా సినిమా చూడండి. ఆ తర్వాత కూడా మిమ్మల్ని కలుస్తాం’ అప్నుడు మీకున్న ఎన్నో రకాల ప్రశ్నలకు సమాధానం చెబుతాం’’ అన్నారు.

ఈ చిత్రంలో ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్యల్లో ఒకదాన్ని చూపించబోతున్నాం. 50శాతం కన్నా ఎక్కువ మంది దంపతులు జీవితాంతం కలిసి ఉంటున్నారు. సమాజం నుంచి ఎదురయ్యే ఒత్తిళ్ల కారణంగానో, ఇతర సమస్య కారణంగానో అలా కలిసి ఉంటున్నారు. కొందరు గృహ హింసను ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో కొందరు మాత్రమే ధైర్యంగా ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్నారు. రాజ్యాంగం మనందరికీ స్వేచ్ఛగా బతికే హక్కును ప్రసాదించింది. సుప్రీంకోర్టు కూడా ఇదే చెప్పింది. మనకున్నది చాలా చిన్న జీవితం, ఉన్నంతకాలం ఆనందంగా ఉండాలి’’ అని నరేశ్‌ చెప్పారు.

Updated Date - 2023-05-19T18:47:13+05:30 IST