Sound Party: మోత మోగిపోయే పార్టీ ఎప్పుడంటే..

ABN , First Publish Date - 2023-11-14T18:20:38+05:30 IST

వీజే స‌న్నీ, హ్రితిక శ్రీనివాస్ జంట‌గా రూపొందిన చిత్రం `సౌండ్ పార్టీ`. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్రం టీజ‌ర్, పాట‌లు మంచి టాక్ తెచ్చుకోగా సినిమాపై ప్రేక్షకుల్లో అంచ‌నాలు పెంచాయి. ఈ సినిమాను ఈనెల 24న ప్రపంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

Sound Party: మోత మోగిపోయే పార్టీ ఎప్పుడంటే..
sound party

ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం-1గా రూపొందిన చిత్రం సౌండ్ పార్టీ(Sound Party). వీజే స‌న్నీ(VJ Sunny), హ్రితిక శ్రీనివాస్ జంట‌గా న‌టించారు. జయ శంకర్ సమర్పణలో రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాత‌లుగా వ్యవహరించగా సంజ‌య్ శేరి ద‌ర్శ‌కత్వం వహించారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్రం టీజ‌ర్, పాట‌లు మంచి టాక్ తెచ్చుకోగా సినిమాపై ప్రేక్షకుల్లో అంచ‌నాలు పెంచాయి. ఈ సినిమాను ఈనెల 24న ప్రపంచవ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయనున్నారు.

ఈ సంద‌ర్భంగా ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ అధినేత ర‌వి పోలిశెట్టి మాట్లాడుతూ..`` ఇప్ప‌టికే విడుద‌లైన మా సౌండ్ పార్టీ చిత్రం టీజ‌ర్ , సాంగ్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయని, బిజినెస్ ప‌రంగా కూడా మంచి రెస్పాన్స్ వ‌స్తోందన్నారు. టీజ‌ర్ లోని డైలాగ్స్ , వీజే స‌న్నీ, శివ‌న్నారాయ‌ణ కెమిస్ట్రీ బాగా కుదిరిందంటున్నారు. ప్ర‌జంట్ ఆడియ‌న్స్ ఫ‌న్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ చిత్రాల‌ను బాగా ఆద‌రిస్తున్నారని అదే త‌ర‌హాలో తెర‌కెక్కిన మా చిత్రాన్ని కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌న్న న‌మ్మ‌కంతో ఉన్నామన్నారు.


SOUND.jpg

స‌మ‌ర్ప‌కుడు జ‌య శంక‌ర్ మాట్లాడుతూ..`పాట‌లు, టీజ‌ర్ సినిమాను ఇప్ప‌టికే ప‌బ్లిక్ లోకి తీసుకెళ్లాయి. సినిమా అంతా పూర్త‌యింది. ద‌ర్శ‌కుడు సంజ‌య్ శేరికి ఏ న‌మ్మ‌కంతో అయితే సినిమా ఇచ్చామో దాన్ని నిల‌బెట్టుకున్నాడని, అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులకు నచ్చే విధంగా ఒక మంచి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ తీశామని, ప్రేక్ష‌కులు మా చిత్రాన్ని ఆద‌రిస్తార‌ని న‌మ్ముతున్నాం` అన్నారు.

ద‌ర్శ‌కుడు సంజ‌య్ శేరి మాట్లాడుతూ..`నిర్మాత‌లు ఇచ్చిన ఫ్రీడంతో సినిమాను అనుకున్న విధంగా తీయ‌గ‌లిగానని, ఇటీవ‌ల సినిమా చూసి యూనిట్ అంతా హ్యాపీగా ఫీల‌య్యామని, మా చిత్రానికి ప‌ని చేసిన న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ స‌పోర్ట్ వ‌ల్లే ఒక మంచి సినిమా చేయ‌గ‌లిగా. ఇప్ప‌టికే టీజ‌ర్ కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ నెల 24న వ‌స్తోన్న సినిమాకు కూడా అదే రెస్పాన్స్ వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంద‌న్నారు.

Updated Date - 2023-11-14T18:29:46+05:30 IST