Vishwak Sen: గోదారోళ్ళం... తేడాలొస్తే నవ్వుతూ నరాలు లాగేస్తాం

ABN , First Publish Date - 2023-07-31T10:49:24+05:30 IST

ఇంతవరకు తెలంగాణ యాస, భాష మాట్లాడుతూ వస్తున్న విశ్వక్ సేన్ తన రాబోయే సినిమాలో గోదావరి యాస, భాష మాట్లాడుతున్నాడు. సినిమాకి 'గ్యాంగ్స్ అఫ్ గోదావరి' అని పెట్టారు, ఒక టీజర్ కూడా విడుదల చేశారు. ఆసక్తికరంగా కనిపిస్తున్న ఈ సినిమా డిసెంబర్ లో విడుదల అవుతుంది అని కూడా ప్రకటించారు.

Vishwak Sen: గోదారోళ్ళం... తేడాలొస్తే నవ్వుతూ నరాలు లాగేస్తాం
A still from Gangs of Godavari

విశ్వక్ సేన్ (VishwakSen) పదకొండో సినిమా టైటిల్ వచ్చేసింది. 'గ్యాంగ్స్ అఫ్ గోదావరి' #GangsOfGodavari అని పెట్టారు. టైటిల్ బట్టి ఇది గోదావరి దగ్గర జరిగే కథ అని ఇట్టే అర్థం అయిపోతోంది. కృష్ణ చైతన్య (KrishnaChaitanya) ఈ సినిమాకి దర్శకుడు, సూర్యదేవర నాగ వంశి (SuryadevaraNagaVamsi), సాయి సౌజన్య (SaiSoujanya) నిర్మాతలు. ఈరోజు ఈ సినిమా టైటిల్, దానితో పాటు ఒక చిన్న టీజర్ విడుదల చేశారు.

vishwaksen-godavari1.jpg

విశ్వక్ సేన్ ఈ సినిమాలో గోదావరి భాష, యాస మాట్లాడతాడు అని కూడా అర్థం అవుతోంది. గోదారోళ్ళం... తేడాలొస్తే నవ్వుతూ నరాలు లాగేస్తాం అనే ఒక డైలాగ్ పెట్టారు. ఇంతవరకు విశ్వక్ సేన్ చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు. ఎందుకంటే ఇందులో అతను గోదావరి యాస మాట్లాడాలి. తెలంగాణ యాస, భాషతో బాగా అలవాటుపడిన విశ్వక్ సేన్ ఈ గోదావరి యాస మాట్లాడాలంటే కొంచెం కృషి చేయాల్సి వుంది.

ఇక ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా (YuvanShankarRaja) సంగీతం సమకూరుస్తున్నారు, అలాగే నవీన్ నూలి (NaveenNooli) ఎడిటింగ్ చేస్తున్నారు. ఈ సినిమాకి బాగా పేరున్న సాంకేతిక నిపుణులే పని చేస్తున్నారు. ఇందులో నాజర్ (Nassar), గోపరాజు రమణ (GoparajuRamana), సాయి కుమార్ (SaiKumar) లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా వున్నారు. దర్శకుడు కృష్ణ చైతన్య ఇంతకు ముందు 'రౌడీ ఫెలో' #RowdyFellow అని ఒక పొలిటికల్ డ్రామా తీసాడు. అది చాలా ప్రసంశలు అందుకొంది. తరువాత 'చల్ మోహన్ రంగా' #ChalMohanRanga అనే సినిమా నితిన్ (Nithiin) తో చేసాడు, కానీ ఆ సినిమా పరవాలేదు అనిపించింది, అంతగా నడవలేదు. ఈ 'గ్యాంగ్స్ అఫ్ గోదావరి' అతనికి దర్శకుడిగా మూడో సినిమా. అంజలి (Anjali) ఈ సినిమాలో ఒక ప్రాముఖ్యమైన పాత్రలో కనిపించనుంది అని తెలుస్తోంది.

Updated Date - 2023-07-31T10:49:24+05:30 IST