Vishwak sen : పేరు ప్రస్తావించకుండా ఏకేశాడు...
ABN , First Publish Date - 2023-07-27T10:42:06+05:30 IST
‘‘హీరో చిన్నోడా, పెద్దోడా అన్నది పక్కనపెడితే ఎవరి స్థాయిలో వారు బిజీగా ఉంటారు. తను ఉన్న పరిస్థితిలో ఎలాంటి సినిమా చేయాలో స్పష్టత లేనప్పుడు గంట కథ విని ‘నో’ అని చెప్పి వారి సమయం ఎందుకు వృథా చేయాలి? మన సినిమా విజయవంతమైతే తలెత్తుకోవడంలో తప్పులేదు. కానీ, సినిమా బాగుందని ఎదుటివారిని కించపరచడం కరెక్ట్ కాదు. అదే కాస్త బాధగా ఉంది’’ అని విశ్వక్‌సేన్ అన్నారు.
‘‘హీరో చిన్నోడా, పెద్దోడా అన్నది పక్కనపెడితే ఎవరి స్థాయిలో వారు బిజీగా ఉంటారు. తను ఉన్న పరిస్థితిలో ఎలాంటి సినిమా చేయాలో స్పష్టత లేనప్పుడు గంట కథ విని ‘నో’ అని చెప్పి వారి సమయం ఎందుకు వృథా చేయాలి? మన సినిమా విజయవంతమైతే తలెత్తుకోవడంలో తప్పులేదు. కానీ, సినిమా బాగుందని ఎదుటివారిని కించపరచడం కరెక్ట్ కాదు. అదే కాస్త బాధగా ఉంది’’ అని విశ్వక్‌సేన్ (Vishwak Sen)అన్నారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో ‘పేక మేడలు’ (Peka medalu(చిత్రం టీజర్‌ను ఆయన విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఓ వివాదం గురించి దర్శకుడు, సినిమా పేరు చెప్పకుండా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
‘‘ఏ నటుడైనా ఎవరి స్థాయిని బట్టి వారు బిజీగా ఉంటారు. ఆ క్రమంలో ‘కలవలేం, కథ వినలేం’ అని దర్శకుడికి చెబుతుంటాం. దానికి కొంతమంది ఫీలవుతుంటారు. ఆ విషయంలో నేనేం చేయలేను. అందరినీ ఆనందంగా ఉంచేందుకు నేను బిర్యానీని కాదు. ఒకరి సమయం వృథా చేయడం ఇష్టం లేకనే నా నోటి నుంచి అప్పుడు ఆ సమాధానం వచ్చింది. మన సినిమా విజయవంతమైతే తలెత్తుకోవడంలో తప్పులేదు. కానీ, సినిమా బాగుందని ఎదుటివారిని కించపరచొద్దు. అదొక్కటి బాధగా ఉంది. తెలుగులో ఓ సినిమా హిట్ అయితే నీది నాది అని కాకుండా ఆనందించే వాళ్లే ఎక్కువమంది ఉంటారు. ఏడ్చేవాళ్లు అతి తక్కువ మంది ఉంటారు. చిన్న సినిమా మొదలై ఆ సినిమా పెద్ద విజయం సాధించినందుకు ఎంతో ఆనందించా. ఆ సినిమా ట్రైలర్ చూసి బాగుందని ‘డైరెక్టర్స్’ వాట్సాప్ గ్రూప్‌లో మొదటి మెసేజ్ పెట్టింది నేనే. అయినా ఆ దర్శకుడికి టైమ్ ఇవ్వలేదు., కలవలేదు అంటూ ఇప్పటికీ మీమ్స్ వస్తున్నాయి. గంట చర్చించి చెప్పడం కంటే ముందే చెప్పడం బెటర్ అనుకుని నో చెప్పా’’ అని వివరణ ఇచ్చారు. ((Vishwak Sen Controversy)
అసలు విషయం ఏంటంటే ఇటీవల విడుదలైన ఓ సినిమా దర్శకుడు ఇంటర్వ్యూ మాట్లాడుతూ ఆ చిత్ర కథను ముందుగా ఓ హీరోకి వినిపించేందుకు ప్రయత్నించగా కలిేసందుకు అతను ఆసక్తి చూపించలేదని తెలిపాడు. ఆ సమయంలో విశ్వక్ ట్వీట్ పెట్టాడు. ఆ దర్శకుడికి కౌంటర్ ఇచ్చేందుకే ఈ హీరో ట్వీట్ చేశాడంటూ వార్తలొచ్చాయి. అలా సోషల్ మీడియాలో వివాదమైంది.