Vishwak Sen: 'దాస్ కా ధమ్కీ’ విడుదల ఎప్పుడంటే...

ABN , First Publish Date - 2023-03-09T17:42:02+05:30 IST

విశ్వక్ సేన్ తన మొదటి పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇందులో అతను కథానాయకుడిగానే కాకుండా, దర్శకత్వం, నిర్మాతగా కూడా పని చేసాడు. ఈ సినిమా విడుదల ఎప్పుడంటే...

Vishwak Sen: 'దాస్ కా ధమ్కీ’ విడుదల ఎప్పుడంటే...

నటుడు విశ్వక్ సేన్ (Vishwak Sen) ‘దాస్ కా ధమ్కీ’ (Das Ka Dhamki) విడుదలకు సిద్ధమవుతోంది. విశ్వక్ సేన్ ఈ సినిమా కోసం చాలా కష్టపడటమే కాకుండా, మొత్తం థానే అయి ఈ సినిమా చిత్రీకరించాడు. అందుకనే నెమో ఇది అతను పాన్ ఇండియా చిత్రం గా విడుదల చెయ్యాలని సంకల్పించాడు. ఎప్పుడు విడుదల చేస్తున్నామో కూడా ప్రకటించేశాడు. ఈ చిత్రాన్ని మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

vishwaksen2.jpg

ఇంకో ఆసక్తికరం అంశం ఏంటంటే ఈ సినిమాలో విశ్వక్ రెండు పాత్రల్లో కనపడబోతున్నాడు. అందుకే ఈ రెండు పాత్రలోని రెండు షేడ్స్‌ని చూపించే అనౌన్స్ మెంట్ పోస్టర్ ఆసక్తికరంగా వుంది. ఒక అవతారం క్లాస్‌, రెండో దానిలో మాస్ లో కనిపించనున్నాడు విశ్వక్ సేన్. ఈ సినిమా అతని కెరీర్ లో భారీ బడ్జెట్‌తో తీసినదిగా చెప్పొచ్చు. ఈ సినిమాకి ఒక్క లీడ్ యాక్టర్ గానే కాకుండా, విశ్వక్ సేన్ దర్శకుడు, నిర్మాత గా కూడా పని చేసాడు.

vishwaksen3.jpg

ఈ చిత్రంలో విశ్వక్ సేన్ జోడిగా నివేదా పేతురాజ్ (Nivtha Pethuraj) నటిస్తోంది. యాక్టర్, నిర్మాత, దర్శకత్వం ఇన్ని చేసాడు అంటే ఈ సినిమా మీద విశ్వక్ చాలా నమ్మకం తో వున్నాడు. అందుకే ఈ సినిమాకి ప్రచారం కూడా అలానే చేస్తున్నాడు. ఈమధ్య చాలా కళాశాలలు తిరిగి, విద్యార్థినీ విద్యార్థులతో ఈ సినిమా గురించి ప్రచారం చేసాడు. ఇప్పటివరకు మూడు పాటలు విడుదల చేశారు, అన్నీ కూడా బాగానే పోయాయి. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలో రావు రమేష్ (Rao Ramesh), హైపర్ ఆది (Hyper Aadhi), రోహిణి (Rohini), పృథ్వీరాజ్ (Prithviraj) ఇతర ప్రముఖ తారాగణం.

Updated Date - 2023-03-09T17:42:03+05:30 IST