Virupaksha Team: ఈసారి కూడా ఆ తరహా కథేనా?

ABN , First Publish Date - 2023-08-14T20:17:08+05:30 IST

సాయితేజ్‌, సంయుక్తా మీనన్‌ జంటగా కార్తీక్‌ వర్మ దండు దర్శకత్వంలో సుకుమార్‌ రైటింగ్స్‌ - శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర (ఎస్‌వీసీసీ) సంయుక్తంగా నిర్మించిన ‘విరూపాక్ష’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే! ఇప్పుడు ‘విరూపాక్ష’ మేకర్స్‌ మరో ప్రాజెక్ట్‌ కోసం కలిశారు.

Virupaksha Team: ఈసారి కూడా ఆ తరహా కథేనా?

సాయితేజ్‌, సంయుక్తా మీనన్‌ జంటగా కార్తీక్‌ వర్మ దండు దర్శకత్వంలో సుకుమార్‌ రైటింగ్స్‌ - శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర (ఎస్‌వీసీసీ) సంయుక్తంగా నిర్మించిన ‘విరూపాక్ష’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే! రోడ్డు ప్రమాదం తర్వాత సాయిధరమ్‌ తేజ్‌ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పుడు ‘విరూపాక్ష’ మేకర్స్‌ మరో ప్రాజెక్ట్‌ కోసం కలిశారు. మైథలాజికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి కార్తిక్‌ దర్శకత్వం వహించనున్నారు. సుకుమార్‌ రైటింగ్స్‌ - ఎస్‌వీసీసీ సంయుక్తంగా దీన్ని నిర్మించనున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడెక్షన్‌ పనులు మొదలయ్యాయి. ఈ చిత్రానికి సంబంధించి ఇతర వివరాలు త్వరలో తెలియజేస్తారు. కార్తిక్‌ వర్మ మిస్టీక్‌ థ్రిల్లర్‌గా రూపొందించిన ‘విరూపాక్ష’ హారర్‌ చిత్రాలను ఇష్టపడేవారినే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. అయితే దర్శకుడు ఈసారి కూడా ఆ తరహా జానర్‌ కథనే ఎంచుకోవడం గమనార్హం.

Updated Date - 2023-08-14T20:17:08+05:30 IST