Jorugaa Husharugaa: డిసెంబ‌రు 15న.. కొత్త‌ విరాజ్‌ను చూస్తారు

ABN , First Publish Date - 2023-11-22T19:50:50+05:30 IST

బేబీ చిత్రంలో న‌టుడిగా అంద‌రి ప్ర‌శంస‌లు అందుకున్న యువ క‌థానాయ‌కుడు విరాజ్ అశ్విన్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘జోరుగా హుషారుగా’ పూజిత పొన్నాడ క‌థానాయిక‌గా నటిస్తుండగా, అను ప్ర‌సాద్ ద‌ర్శ‌కత్వం వహిస్తున్నారు. యూత్‌ఫుల్ అండ్ ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డిసెంబ‌రు 15న విడుద‌ల చేస్తున్న‌ట్లు మేకర్స్ ప్ర‌క‌టించారు. ఇందుకు సంబంధించిన రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ను బుధ‌వారం విడుద‌ల చేశారు.

Jorugaa Husharugaa: డిసెంబ‌రు 15న.. కొత్త‌ విరాజ్‌ను చూస్తారు
jorugaa husharugaa

బేబి చిత్రంలో న‌టుడిగా అంద‌రి ప్ర‌శంస‌లు అందుకున్న యువ క‌థానాయ‌కుడు విరాజ్ అశ్విన్ (viraj ashwin) హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘జోరుగా హుషారుగా’ (Jorugaa Husharugaa) పూజిత పొన్నాడ (pujita ponnada) క‌థానాయిక‌గా నటిస్తుండగా, అను ప్ర‌సాద్ ద‌ర్శ‌కత్వం వహిస్తున్నారు. శిఖ‌ర అండ్ అక్ష‌ర ఆర్ట్స్ ఎల్ఎల్‌పీ ప‌తాకంపై నిరీష్ తిరువిధుల నిర్మిస్తున్నారు. యూత్‌ఫుల్ అండ్ ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్15న విడుద‌ల చేస్తున్న‌ట్లు మేకర్స్ ప్ర‌క‌టించారు. ఇందుకు సంబంధించిన రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ను బుధ‌వారం విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత చిత్ర విశేషాల‌ను తెలియ‌జేస్తూ యూత్‌ఫుల్ అండ్ ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపొందుతున్నదని, ఇటీవ‌ల విడుద‌ల చేసిన టీజ‌ర్‌కు, పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌చ్చిందన్నారు. సినిమాలో అంద‌ర్ని ఆక‌ట్టుకునే వినోదం ఉంటుందని, చిత్రం చూసిన ప్ర‌తి ఒక్క‌రూ ఓ మంచి సినిమా చూశామ‌నే అనుభూతికి లోన‌వుతారన్నారు. ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ స‌హ‌కారంతో చిత్రాన్ని డిసెంబ‌రు 15న విడుద‌ల చేస్తున్నట్లు ప్రకటించారు.


ద‌ర్శ‌కుడు అను ప్ర‌సాద్ మాట్లాడుతూ ఈ చిత్రంలో కొత్త‌ విరాజ్ అశ్విన్‌ను చూస్తారని, ఆయ‌న పాత్రలో మంచి ఎన‌ర్జీ ఉంటుందని, బేబీ చిత్రంతో యూత్‌కు ద‌గ్గ‌రైన విరాజ్ ఈ చిత్రంతో వారికి మరింత చేరువ‌తాడన్నారు. కొత్తద‌నం ఆశించే ప్ర‌తి ఒక్క‌రికి మా చిత్రం త‌ప్ప‌కుండా న‌చ్చుతుంద‌నే న‌మ్మకం ఉందన్నారు.

Updated Date - 2023-11-22T19:52:23+05:30 IST