సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Vinaro Bhagyamu Vishnu Katha: ‘ఓ బంగారం’ రెడీ

ABN, First Publish Date - 2023-01-18T00:56:24+05:30

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ (Allu Aravind) స‌మ‌ర్ప‌ణ‌లో.. జీఏ2 పిక్చ‌ర్స్ (GA2 Pictures) బ్యాన‌ర్‌పై తెరకెక్కుతోన్న చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’

Vinaro Bhagyamu Vishnu Katha
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ (Allu Aravind) స‌మ‌ర్ప‌ణ‌లో.. జీఏ2 పిక్చ‌ర్స్ (GA2 Pictures) బ్యాన‌ర్‌పై తెరకెక్కుతోన్న చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’ (Vinaro Bhagyamu Vishnu Katha). కిర‌ణ్ అబ్బ‌వ‌రం (Kiran Abbavaram) హీరోగా, కశ్మీర పర్ధేశీ (Kashmira Pardesi) హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి బ‌న్నీ వాసు (Bunny Vas) నిర్మాత‌. తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంతో ముర‌ళి కిషోర్ అబ్బూరు (Murali Kishor Abburu) ద‌ర్శ‌కుడిగా తెలుగు ఇండస్ట్రీకి ప‌రిచయం అవుతున్నారు. రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ‘వాసవసుహాస’ పాట ట్రెమండస్ రెస్పాన్స్‌ను రాబట్టుకున్న విషయం తెలిసిందే. అలాగే టీజర్ కూడా ఆకట్టుకోవడమే కాకుండా.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ చిత్ర సెకెండ్ సింగిల్ ప్రోమోని చిత్రబృందం విడుదల చేసింది. ఈ పూర్తి పాటను జనవరి 19న విడుదల చేయనున్నారు.

చిన్నపాటి టీజర్‌గా ఉన్న ఈ ప్రోమోలో కిరణ్, కశ్మీర‌ల మధ్య కెమిస్ట్రీ చూడముచ్చటగా ఉంది. ఈ పాట కూడా ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని చిత్రయూనిట్ కాన్ఫిడెంట్‌గా చెబుతోంది. విడుదలైన ప్రోమో కూడా అలానే ఉంది. కాగా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేస్తున్న ఈ సినిమాకు విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి స‌హ నిర్మాత‌గా బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2023 ఫిబ్రవరి 17న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. (Vinaro Bhagyamu Vishnu Katha Second Single Promo)

Updated Date - 2023-01-18T00:56:28+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!