#ThalapathyVijay: వారసుడు ప్రమోషన్స్ కి ఇక్కడికి రాడట

ABN , First Publish Date - 2023-01-04T16:38:16+05:30 IST

దిల్ రాజు తెలుగులో 'వారసుడు' సినిమా ప్రమోషన్స్ భారీగా చెయ్యాలని చూస్తున్నాడు. కానీ విజయ్ మాత్రం తెలుగు ప్రమోషన్స్ కి దూరంగా వుంటాను అని దిల్ రాజు కి చెప్పాడు అని తెలిసింది.

#ThalapathyVijay: వారసుడు ప్రమోషన్స్ కి ఇక్కడికి రాడట

నిర్మాత దిల్ రాజు (Producer #DIlRaju) తమిళ సూపర్ స్టార్ విజయ్ (#ThalapathyVijay) తో 'వారిసు' (#Varisu) అనే సినిమాని తీసాడు. ఇది తెలుగులో 'వారసుడు'గా (#Varasudu) సంక్రాంతి పండగ (Sankranthi festival) సందర్భంగా ఈనెల అంటే జనవరి 12న (January 12) విడుదల అవుతోంది. దీనికి తెలుగు దర్శకుడు వంశి పైడిపల్లి దర్శకత్వం (Vamshi Paidipalli) వహించారు. ఈమధ్య చెన్నై లో ఈ సినిమా తమిళ ప్రమోషన్స్ కి విజయ్ అటెండ్ అయ్యాడు. అయితే దిల్ రాజు తెలుగులో కూడా ఈ సినిమా ప్రమోషన్స్ భారీగా చెయ్యాలని చూస్తున్నాడు. కానీ విజయ్ మాత్రం తెలుగు ప్రమోషన్స్ కి దూరంగా వుంటాను అని దిల్ రాజు కి చెప్పాడు అని తెలిసింది. (Vijay is not attending for the Telugu film promotions, says a source) అదీ కాకుండా దిల్ రాజు సినిమా డబ్బింగ్ సినిమా అని, అది ఇంత పెద్ద పండగ రోజు తెలుగు సినిమాలకి ప్రాధాన్యం ఇవ్వకుండా డబ్బింగ్ సినిమా ఎలా విడుదల చేస్తారని, గత కొంత కాలంగా తెలుగు పరిశ్రమలో రచ్చ జరుగుతోంది.

varasudu.jpg

చిరంజీవి (Chiranjeevi) నటించిన 'వాల్తేరు వీరయ్య', (#WaltairVeerayya) అలాగే బాలకృష్ణ నటించిన 'వీరసింహ రెడ్డి' (#VeeraSimhaReddy) రెండు సినిమాలు పండగకి వస్తున్నాయి. కానీ దిల్ రాజు తన థియేటర్స్ లో మాత్రం తన డబ్బింగ్ సినిమా వారసుడు వేసుకుంటాను అని చెప్పినట్టు తెలుస్తోంది. ఈ విషయం ఇలా నడుస్తుంటే, విజయ్ తెలుగు సినిమా ప్రమోషన్స్ కి రాను అనటం వాళ్ళ దిల్ రాజు కొంచెం డీలా పడ్డ మాట వాస్తవం అని అంటున్నారు. అయినా, అందులో రష్మిక మందన్న (Rashmika Mandanna), నటుడు శ్రీకాంత్ (Srikanth), జయసుధ, దర్శకుడు వంశీ పైడిపల్లి ఇంకా చాలామంది తెలుగు వాళ్ళు ఈ సినిమాలో పనిచేయటంతో వాళ్ళతో ప్రమోషన్స్ చెయ్యాలని చూస్తున్నాడు అని కూడా అంటున్నారు. ఏమైనా పండగ అయిపోయేంత వరకు దిల్ రాజు ఇలా వార్తల్లో ఉంటూనే ఉంటాడు అని పరిశ్రమలో టాక్ నడుస్తోంది.

Updated Date - 2023-01-04T16:38:18+05:30 IST