Chiranjeevi: మరో యువ దర్శకుడు రెడీ!

ABN , First Publish Date - 2023-05-06T11:19:01+05:30 IST

చిరంజీవి మంచి జోరు మీదున్నారు. ఓ పక్క కథలు వింటూ, మరో పక్కా షూటింగ్‌లో పాల్గొంటూ తీరిక లేకుండా గడుపుతున్నారు. ఆయనతో సినిమాలు చేయడానికి యువ దర్శకులు ఉత్సాహం చూపిస్తున్నారు.

Chiranjeevi: మరో యువ దర్శకుడు రెడీ!

చిరంజీవి (Chiranjeevi) మంచి జోరు మీదున్నారు. ఓ పక్క కథలు వింటూ, మరో పక్కా షూటింగ్‌లో పాల్గొంటూ తీరిక లేకుండా గడుపుతున్నారు. ఆయనతో సినిమాలు చేయడానికి యువ దర్శకులు ఉత్సాహం చూపిస్తున్నారు. ఒకప్పుడు చిరుతో సినిమా అంటే నాలుగైదు సినిమాలు హిట్స్‌ పడాలి, మాస్‌ పల్స్‌ బాగా తెలుసుండాలి. ఈ క్వాలిటీలు ఉంటే తప్ప కొత్త దర్శకుడికి చిరు అపాయింట్‌మెంట్‌ దొరికేది కాదు. ఇప్పుడు అలా కాదు. యువ దర్శకులైతే తనని కొత్తగా చూపిస్తారని నమ్మకంతో ఉన్నారు. ఓ సినిమాతో దర్శకుడిగా నిరూపించుకుంటే చాలు. చిరుకు కథ చెప్పే అవకాశం కుదురుతుంది. చెప్పిన కథ ఓకే అవుతుందా లేదా అనేది తర్వాత విషయం. దర్శకుడైతే చిరంజీవికి కథ చెప్పే అవకాశాన్ని పొందగలుగుతున్నారు. యునీక్‌ కథతో ఎవరొచ్చిన ఆయన కథలు వింటున్నారు. ఇప్పటికే ఆయనతో సినిమా చేయడానికి యువ దర్శకులు క్యూ కడుతున్నారు. బింబిసార దర్శకుడు వశిష్ఠ, కళ్యాణ్‌ కృష్ణ కథలు దాదాపుగా ఫైనల్‌ అయ్యాయని సమాచారం. ఇప్పుడు మరో దర్శకుడు చిరు కోసం కథ సిద్ధం చేశారట. ‘నాంది’, తాజాగా ‘ఉగ్రం’ చిత్రాలతో విజయం అందుకున్న విజయ్‌ కనకమేడల చిరంజీవి కోసం కథ రెడీ చేసుకుంటున్నారని తెలిసింది. అంతా ఓకే అయితే క్యూలో ఉన్న మూడో దర్శకుడు విజయ్‌ అవుతాడు. (Vijay kanakamedala Story for Chiranjeevi)

ఈ ఏడాది సంక్రాంతి బరిలో ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంతో భారీ విజయం (Bhola Shankar) అందుకున్న చిరంజీవి ప్రస్తుతం ‘భోళా శంకర్‌’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇటీవల డబ్బింగ్‌ కార్యక్రమాలు మొదలయ్యాయి. రాంబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరు సరసన తమన్నా కథానాయికగా నటిస్తున్నారు. కీర్తి సురేశ్‌ ఆయనకు సోదరిగా కనిపిస్తారు. మహతి స్వరసాగర్‌ సంగీతం అందిస్తున్నారు.

Updated Date - 2023-05-06T11:35:15+05:30 IST