Vijay Jagarlamudi: విడుదలకు నోచుకోకపోవడంతో ఒత్తిడికి గురై..

ABN , First Publish Date - 2023-08-18T16:41:42+05:30 IST

కోట్లు ఖర్చు చేసి సినిమా తీసి విడుదల చేయలేకపోవడం, దాంతో ఒత్తిడికి గురికావడంతో నిర్మాత విజయ్‌ జాగర్లమూడి గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ పిలుపుతో ప్రేరణ పొంది స్వతంత్రం కోసం చిన్న వయసులో ప్రాణ త్యాగం చేసిన ఓ మహనీయుడి ఖుదీరామ్‌ బోస్‌ పై సినిమా తీశారాయన.

Vijay Jagarlamudi: విడుదలకు నోచుకోకపోవడంతో ఒత్తిడికి గురై..

కోట్లు ఖర్చు చేసి సినిమా తీసి విడుదల చేయలేకపోవడం, దాంతో ఒత్తిడికి గురికావడంతో నిర్మాత విజయ్‌ జాగర్లమూడి (vijay jagarlamudi) గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ పిలుపుతో ప్రేరణ పొంది స్వతంత్రం కోసం చిన్న వయసులో ప్రాణ త్యాగం చేసిన ఓ మహనీయుడి ఖుదీరామ్‌ బోస్‌ పై(Khudiram Bose) సినిమా తీశారాయన. సినిమాను విడుదల చేయలేకపోవడం, ఆర్థిక భారాన్ని తట్టుకోలేక గుండెపోటుకు గురయ్యారు. బయోపిక్స్‌ ట్రెండ్‌ నడుస్తున్న తరుణంలో ఖుదిరామ్‌ బోస్‌ గురించి ఈ జనరేషన్‌కు తెలియజేయాలనే తపనతో గోల్డెన్‌ రెయిన్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఆయన ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మించారు.

2.jpg

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేసిన ఈ చిత్రాన్ని ఇటీవల గోవాలో జరిగిన ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియాలో ప్రదర్శించారు. గత ఏడాది డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని పార్లమెంట్‌ సభ్యులకు ప్రదర్శించారు. సినీ, రాజకీయ ప్రముఖుల ప్రశంసలు పొందింది కానీ విడుదలకు నోచుకోలేదు. చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన సాంకేతిక నిపుణులు ఈ సినిమాకి పనిచేశారు. మణిశర్మ సంగీతం అందించారు. తోట తరణి ప్రొడక్షన్‌ డిజైనర్‌గా పని చేశారు.

Updated Date - 2023-08-18T16:41:42+05:30 IST