Vijay: మరోసారి విజయ్‌ దాతృత్వం...

ABN , Publish Date - Dec 30 , 2023 | 11:51 PM

కోలీవుడ్‌ నటుడు విజయ్‌ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. తమిళనాడు వరద బాధితులకు అండగా నిలిచాడు. ఇటీవల ఏర్పడిన వరదల వల్ల చాలామంది నిరాశ్రయులయ్యారు.

Vijay: మరోసారి విజయ్‌ దాతృత్వం...

కోలీవుడ్‌ నటుడు విజయ్‌ (Vijay) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. తమిళనాడు వరద బాధితులకు అండగా (kollywood) నిలిచాడు. ఇటీవల ఏర్పడిన వరదల వల్ల చాలామంది నిరాశ్రయులయ్యారు. వరదవల్ల ఇబ్బంది పడుతున్న వారిని విజయ్‌ పరామర్శించారు. ఈ మేరకు శనివారం ఉదయం తూత్తుకుడి, నెల్లైలో పర్యటించిన ఆయన.. బాధితులకు బియ్యం, కూరగాయలు, వంటి నిత్యావసర వస్తువులను అందించారు. దీనికి సంబంధించి వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

విజయ్‌ గొప్ప మనసును అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ ఏడాది వారిసు, లియో చిత్రాలతో అలరించిన విజయ్‌ ప్రస్తుతం వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. విజయ్‌ 68గా ఈ ప్రాజెక్ట్‌ ప్రచారంలో ఉంది. మీనాక్షి చౌదరి కథానాయిక.

Updated Date - Dec 30 , 2023 | 11:51 PM