Vijay Deverakonda: నూతన సంవత్సర శుభాకాంక్షలు.. రష్మిక పిక్స్‌తో పోల్చుతూ నెటిజన్స్ కామెంట్స్..

ABN , First Publish Date - 2023-01-01T20:44:19+05:30 IST

టాలీవుడ్‌లోని సూపర్ స్టార్స్ లో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఒకరు. ‘పెళ్లి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ ఓ ఫొటోను షేర్ చేశాడు.

Vijay Deverakonda: నూతన సంవత్సర శుభాకాంక్షలు.. రష్మిక పిక్స్‌తో పోల్చుతూ నెటిజన్స్ కామెంట్స్..

టాలీవుడ్‌లోని సూపర్ స్టార్స్ లో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఒకరు. ‘పెళ్లి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో విజయ్ ఓ ఫొటోను షేర్ చేశాడు. అది నెట్టింట వైరల్‌గా మారింది. అందుకు కారణమేంటంటే..

Rashmika-Mandanna.jpg

బీచ్ పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో విజయ్ మద్యం బాటిల్ చేతిలో పట్టుకుని కనిపించాడు. కొత్త ఏడాది శుభాకాంక్షలు చెప్పాడు. ‘‘ఈ ఏడాది మనకు ఎన్నో జ్ఞాపకాలు మిగిలాయి. ఎన్నో సార్లు గట్టిగా నవ్వుకున్నాం. నిశ్శబ్దంగా ఏడ్చాం. లక్ష్యాలను చేధించడానికి ప్రయత్నించాం. కొన్ని గెలిచాం. మరికొన్ని ఓడిపోయాం. మనం అన్నింటిని సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే అదే జీవితం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. వచ్చే ఏడాది మరింత బాగుండాలని ఆశిద్దాం’’ అని ఆ పిక్‌కు క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విజయ్ అభిమానులందరు షేర్ చేస్తున్నారు. కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. రష్మిక మందన్నా (Rashmika Mandanna) గతంలో పోస్ట్ చేసిన ఫొటోలతో పోల్చుతున్నారు. రౌడీ హీరో, రష్మిక కలసి అక్టోబర్‌లో మాల్దీవుల వెకేషన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఎయిర్ పోర్టులో వీరిద్దరు జంటగా కనిపించారు. ఈ నేపథ్యంలో రష్మికతో కలసి మాల్దీవుల హాలీడేస్‌కు వెళ్లినప్పుడు తీసుకున్న ఫొటోనే ఇది అని అభిమానులు పోస్ట్‌లు పెడుతున్నారు. ‘‘లైగర్ ఫెయిల్యూర్ తర్వాత రష్మిక మందన్నా ఇక్కడి నుంచే పిక్స్ అప్‌లోడ్ చేసింది. కానీ, విజయ్ మాత్రం ప్రస్తుతం పోస్ట్ చేస్తున్నాడు. విజయ్, రష్మిక పిక్స్‌లోని బ్రేక్‌ఫాస్ట్ ట్రే కూడా సేమ్‌గా ఉంది’’ అని ఓ అభిమాని కామెంట్ చేశాడు.

Updated Date - 2023-10-27T14:51:08+05:30 IST