Rashmika Mandanna: విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ లో రష్మిక.. వీడియో లీక్!

ABN , First Publish Date - 2023-11-30T20:39:10+05:30 IST

ఖుషి సినిమా అనంతరం విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ఫ్యామిలీస్టార్. ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో రష్మిక నటిస్తుందనే వార్తలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. వారంతా కలిసి డ్యాన్స్ చేసిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట లీక్ అయి బాగా వైరల్ అవుతున్నది.

Rashmika Mandanna: విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ లో రష్మిక.. వీడియో లీక్!
family star

ఖుషి సినిమా అనంతరం విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా నటిస్తున్న తాజా చిత్రం ఫ్యామిలీస్టార్ (Family Star). గతంలో విజయ్, రష్మికల గీతాగోవిందం సినిమాకు, మహేశ్ బాబు సర్కారువారి పాట చిత్రాలకు దర్శకత్వం వహించిన పరశురాం ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. కాగా 2024 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని అనుకున్నప్పటికీ మార్చికి వాయిదా వేయడం జరిగింది.

అయితే గత కొంతకాలంగా ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో రష్మిక (Rashmika Mandanna) నటిస్తుందనే వార్తలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ వార్తలు నిజమే అని ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలను పరిశీలిస్తే తెలుస్తున్నది. ఈ చిత్రంలో కథానాయికగా చేస్తున్న మృణాల్ (Mrunal Thakur) ఈ చిత్రం లొకేషన్ కు సంబంధించిన ఫొటోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా, అదే సెట్ కి సంబంధించిన ఫొటోను రష్మిక (Rashmika Mandanna) కూడా షేర్ చేయడంతో తను కూడా ఈ సినిమాలో ఉన్నదనే క్లారిటీ వచ్చింది.


అంతేకాకుండా తాజాగా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక, మృణాల్ (Mrunal Thakur) లు కలిసి డ్యాన్స్ చేసిన ఓ వీడియో నెట్టింట లీక్ అయి బాగా వైరల్ అవుతున్నది. అయితే అందులో రష్మిక లీడ్ రోల్ లో ఉంటుందా లేక అతిథి పాత్రలో నటిస్తుందా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇదిలాఉండగా రష్మిక (Rashmika Mandanna) తాాజాగా నటించిన పాన్ ఇండియా చిత్రం రేపు (డిసెంబర్ 1) న విడుదల కానుంది. గర్ల్ ఫ్రెండ్ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తున్నది.

Updated Date - 2023-11-30T20:39:12+05:30 IST