scorecardresearch

VijayDeverakonda: కొచ్చిలో పుట్టినరోజు వేడుకలు, గౌరవం పెరిగింది, ఎందుకంటే....

ABN , First Publish Date - 2023-05-08T14:27:00+05:30 IST

విజయ్ దేవరకొండ పుట్టినరోజు 'ఖుషి' సినిమా యూనిట్ తో చేసుకుంటున్నాడు. ఈ సినిమా తో పాటు, ఇంకో రెండు సినిమాల నుండి అతని లుక్ విడుదల అవొచ్చని అంటున్నారు. అలాగే అనసూయ వేసిన ట్వీట్ లకి విజయ్ చేసిన పనికి గౌరవం పెరిగిందని, ఇంతకీ అతను ఏమి చేసాడు అంటే..

VijayDeverakonda: కొచ్చిలో పుట్టినరోజు వేడుకలు, గౌరవం పెరిగింది, ఎందుకంటే....

విజయ్ దేవరకొండ (VijayDeverakonda) పుట్టినరోజు వేడుకలు రేపు 'ఖుషి' (Kushi) సినిమా షూటింగ్ లో యూనిట్ సభ్యుల మధ్య జరుపుకుంటాడు అని తెలిసింది. ఈరోజు ఈవెనింగ్ దర్శకుడు శివనిర్వాణ (Shiva Nirvana), టీం కొచ్చి చేరుకుంటారని, సమంత (Samantha) కూడా షూటిగ్ లో పాల్గొంటోంది అని తెలిసింది. విజయ్ పుట్టినరోజు సందర్బంగా 'ఖుషి' సినిమా నుండి పాటను (Song release) విడుదల చేస్తున్నారు. అలాగే దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో (Gautam Tinnanuri) సినిమా కొన్ని రోజుల క్రితమే లాంచ్ అయింది, ఆ సినిమా నుండి ఫస్ట్ లుక్ కూడా వస్తుంది అని అనుకుంటున్నారు.

vijayd2.jpg

అలాగే దిల్ రాజు (Dil Raju), పరశురామ్ (Parasuram), విజయ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా నుండి కూడా లుక్ ఒకటి విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ఇలా ఈ మూడు సినిమాల నుండి విజయ్ కి సంబంధించి వార్తలు వస్తాయని అనుకుంటున్నారు.

ఇదిలా ఉంటే, విజయ్ మీద పరిశ్రమలో మరికొంచెం గౌరవం పెరిగింది అని ఒక టాక్ నడుస్తోంది. ఎందుకంటే, ప్రముఖ యాంకర్, నటి అనసూయ (Anasuya) కొన్ని రోజుల కిందట అనవసరంగా విజయ్ దేవరకొండ మీద ట్వీట్ చెయ్యడం, మళ్ళీ దాని మీద ఆమె ఇంకో ట్వీట్ వెయ్యటం, ఇలా ఆమె కావాలనే చేసినట్టుగా కనపడుతోంది అని టాక్ నడుస్తోంది. ఆమె ఇంత చేసినా, విజయ్ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం వలన అతని గౌరవం పెరిగింది అని పరిశ్రమలో టాక్ నడుస్తోంది.

vijayd3.jpg

అనసూయ ఆలా ట్వీట్ వెయ్యబట్టే, విజయ్ అభిమానులు రెచ్చిపోయారు. ఆమె కెలుక్కొని, ఆమే అంతా చేసి, మళ్ళీ విజయ్ ని సారీ చెప్పమంటోంది, ఇది చాలా తప్పు అని పరిశ్రమలో అంటున్నారు. అసలు ప్రతి స్టార్ అభిమానులు వాళ్ళ స్టార్ ని అంటే, ఊరుకుంటారా, ఊరుకోరు. ఎవరికీ సాంఘీక మాధ్యమం లో కంట్రోల్ లేదు. అలాంటిది అందులో ఈమె వేసిన ట్వీట్ కి ఎవరో ఎదో కామెంట్ పెడితే, దానికి విజయ్ ఎందుకు సారీ చెప్పాలి అని పరిశ్రమలో అంటున్నారు. అదీ కాకుండా, అతను చాలా సంయనం పాటించి, సైలెంట్ గా వున్నాడు, అది చాలు అని అంటున్నారు. అందువల్లే అతనికి గౌరవం ఇంకా ఎక్కువయింది అని కూడా అంటున్నారు.

Updated Date - 2023-05-08T14:27:00+05:30 IST