Vijay Devarakonda12 : పీరియాడికల్‌ డ్రామా మొదలైంది

ABN , First Publish Date - 2023-06-16T20:24:39+05:30 IST

విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ‘వీడీ12’ చిత్రం మొదటి షెడ్యూల్‌ శుక్రవారం మొదలైంది. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న ఈ పీరియాడికల్‌ డ్రామాలో శ్రీలీల కథానాయిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంయుక్తంగా నిర్మిస్తోంది.

Vijay Devarakonda12 : పీరియాడికల్‌ డ్రామా మొదలైంది

విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా తెరకెక్కుతున్న ‘వీడీ12’ (VD12)చిత్రం మొదటి షెడ్యూల్‌ శుక్రవారం మొదలైంది. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న ఈ పీరియాడికల్‌ డ్రామాలో శ్రీలీల కథానాయిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంయుక్తంగా నిర్మిస్తోంది. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో వస్తున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ సారథి సూడియోస్‌లో ప్రారంభమైంది. అవార్డ్‌ విన్నింగ్‌ స్పోర్ట్స్‌ డ్రామా జెర్సీతో దర్శకుడిగానిరూపించుకున్న గౌతమ్‌ తిన్ననూరి, రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండతో చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు పెరిగాయి. టాలీవుడ్‌లో మోస్ట్‌ హ్యాపెనింగ్‌ హీరోయిన్లలో ఒకరైన శ్రీలీల కథానాయికగా నటించడం ప్రత్యేక ఆకర్షణ కానుంది.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన విజయ్‌ దేవరకొండ కొత్త పోస్టర్‌ యూనిట్‌ విడుదల చేశారు. పోలీస్‌ గెటప్‌లో గన్‌ పట్టుకొని విజయ్‌ చాలా ఇంటెన్స్‌గా కనిపిస్తున్నాడు. ఈ చిత్రానికి అనిరుద్‌ రవిచంద్రన్‌ సంగీత దర్శకడు.

Updated Date - 2023-06-16T20:31:09+05:30 IST