Vijay Devarakonda: 'బేబీ' చూసి విజయ్ ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2023-07-14T12:28:33+05:30 IST

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన చిత్రం బేబీ. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్‌కేఎన్ నిర్మించారు. సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూలై 14న రిలీజ్ అయింది. 13న వేసిన ప్రీమియర్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విజయ్ దేవరకొండ ఈ ప్రీమియర్ షోను వీక్షించారు.

Vijay Devarakonda: 'బేబీ' చూసి విజయ్ ఏమన్నారంటే..

ఆనంద్ దేవరకొండ(Ananda Devarakonda), వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ నటించిన చిత్రం బేబీ(Baby). మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్‌కేఎన్ (SKN)నిర్మించారు. సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే బేబీ సినిమాలోని పాటలు సెన్సేషన్‌ను క్రియేట్ చేశాయి. విజయ్ బుల్గానిన్ ఇచ్చిన సంగీతం సినిమాకు ప్రాణంగా నిలిచింది. ఈ మూవీ జూలై 14న రిలీజ్ అయింది. 13న వేసిన ప్రీమియర్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విజయ్ దేవరకొండ ఈ ప్రీమియర్ షోను వీక్షించారు. ప్రీమియర్ షో అనంతరం...

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) మాట్లాడుతూ ‘ఆడియెన్స్ ఇంత బాగా సినిమా మీద ప్రేమ చూపిస్తున్నారు. సాయి రాజేష్‌ను చూస్తుంటే గర్వంగా ఉంది. ఆనంద్, వైష్ణవి, విరాజ్ ఇలా అందరూ కలిసి ఏడిపించారు. ఈ సినిమా టీమ్ ను చూస్తుంటే గర్వంగా ఉంది: అని అన్నారు.

రాశీ ఖన్నా మాట్లాడుతూ.. ‘సినిమా చూస్తుంటే నా స్కూల్ డేస్ గుర్తుకు వచ్చాయి. నాకు మామూలుగానే లవ్ స్టోరీ సినిమాలంటే ఇష్టం. ఇదో అందమైన ప్రేమ కథ అని అన్నారు.


నిర్మాత ఎస్‌కేఎన్ మాట్లాడుతూ.. ‘రెండున్నరేళ్లుగా కంటెంట్‌ను మాత్రమే నమ్మి సినిమాను తీశాం.మాస్ డైలాగ్స్, పంచ్ డైలాగ్స్ కాదు.. నేను కంటెంట్‌ను నమ్మాను. ఈ తరం వాళ్లు ప్రేమలో పడాలన్నా, ప్రేమ గురించి తెలుసుకోవాలన్నా కూడా బేబీ సినిమా వాళ్లకు పుస్తకంలాంటిది. ఆనంద్, వైష్ణవి, విరాజ్ అద్భుతంగా నటించారు. నన్ను నమ్మి ఆనంద్‌ను విజయ్ నా చేతుల్లో పెట్టాడు. రేపటి నుంచి బేబీ సంచలనాలు సృష్టించబోతోన్నాం. ప్రేక్షకులకు కల్ట్ బొమ్మ ఇచ్చాం' అని అన్నారు.

ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘ఏం మాట్లాడాలో నాకు తెలియడం లేదు. బయట రోడ్లన్నీ బ్లాక్ అయ్యాయి. ఇదంతా మన సినిమాకే జరిగిందా? అని అనిపిస్తుంది. థియేటర్లో అరుపులు వినిపిస్తున్నాయి. ఏడుపులు వినిపిస్తున్నాయి. నన్ను నమ్మి నాకు ఈ సినిమాను ఇచ్చిన సాయి రాజేష్ అన్న, ఎస్‌కేఎన్ అన్నకి థాంక్స్. వైష్ణవి, విరాజ్‌ల సీన్లకు నేను అరుస్తున్నాను’ అని అన్నారు.

Updated Date - 2023-07-14T12:28:33+05:30 IST