Samantha - VD: ఈ టైంలో ఫోన్ ఏంటి విజయ్‌?

ABN , First Publish Date - 2023-08-28T15:50:02+05:30 IST

విజయ్‌ దేవరకొండ అర్ధరాత్రి ఒంటి గంటకు సమంతకు కాల్‌ చేశాడు. కంగారు పడి ఫోన్‌ తీసిన సమంత ‘అంతా ఓకేనా ఈ టైమ్‌లో కాల్‌ ఏంటి’ అని అడగడంతో పాట పాడి కంగారులో ఉన్న సమంతను కూల్‌ చేశాడట విజయ్‌. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

Samantha - VD:  ఈ టైంలో ఫోన్ ఏంటి విజయ్‌?

విజయ్‌ దేవరకొండ(VD)అర్ధరాత్రి ఒంటి గంటకు సమంతకు (Samantha) కాల్‌ చేశాడు. కంగారు పడి ఫోన్‌ తీసిన సమంత ‘అంతా ఓకేనా ఈ టైమ్‌లో కాల్‌ ఏంటి’ అని అడగడంతో పాట పాడి (Mid Night Call) కంగారులో ఉన్న సమంతను కూల్‌ చేశాడట విజయ్‌. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? వీరిద్దరూ కలిసి నటించిన లవ్‌స్టోరి ‘ఖుషి’ (kushi)సినిమా ప్రమోషన్‌ కోసం. సెప్టెంబర్‌ ఒకటో తేదిన ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేశారు. రోజుకో అప్‌డేట్‌ ఇస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తున్నారు. ఇప్పుడు సమంత, విజయ్‌ల వీడియో కాల్‌ చేసిన వీడియోను విజయ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఆ వీడియో కాల్‌లో ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారంటే..

సమంతకు వీడియో కాల్‌ చేసిన విజయ్‌ దేవరకొండ ‘నీకు నాక్‌ నాక్‌ జోక్‌ చెబుదామని వీడియో కాల్‌ చేశాను’ అని అనగా.. టైమ్‌ అర్థరాత్రి 1.30 అయింది.. ఇప్పుడు జోక్‌ ఏంటని సమంత ప్రశ్నించింది. అంతే కాదు ఈ వీడియోలో సమంత కోసం ‘నా రోజా నువ్వే..’ పాట కూడా పాడారు. సామ్‌ నిన్ను ఎంతో మిస్‌ అవుతున్నా అని చెప్పుకొచ్చారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది.

Updated Date - 2023-10-27T14:50:17+05:30 IST