Kushi Twitter review: విజయ్‌- సమంత నటించిన ‘ఖుషి’పై నెటిజన్ల అభిప్రాయం ఏంటంటే..!

ABN , First Publish Date - 2023-09-01T10:14:01+05:30 IST

‘లైగర్‌’ పరాజయం తర్వాత విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కించిన చిత్రం ‘ఖుషి’. అగ్ర కథానాయిక సమంత విజయ్‌ సరసన హీరోయిన్‌గా నటించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ‘ఇక లవ్‌స్టోరీలు చేయను అని ఓ సందర్భంలో స్టేట్‌మెంట్‌ ఇచ్చిన విజయ్‌ ‘లైగర్‌’తో ఘోర పరాజయంతో మళ్లీ రూట్‌ మార్చి లవ్‌స్టోరీ వైపు వచ్చాడు.

Kushi Twitter review: విజయ్‌- సమంత నటించిన ‘ఖుషి’పై నెటిజన్ల అభిప్రాయం ఏంటంటే..!

‘లైగర్‌’ పరాజయం తర్వాత విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కించిన చిత్రం ‘ఖుషి’. అగ్ర కథానాయిక సమంత విజయ్‌ సరసన హీరోయిన్‌గా నటించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ‘ఇక లవ్‌స్టోరీలు చేయను అని ఓ సందర్భంలో స్టేట్‌మెంట్‌ ఇచ్చిన విజయ్‌ ‘లైగర్‌’తో ఘోర పరాజయంతో మళ్లీ రూట్‌ మార్చి లవ్‌స్టోరీ వైపు వచ్చాడు. ప్రేమకథను తెరకెక్కించడంలో శివ నిర్వాహణకు ప్రత్యేక శైలి ఉంది. దానికి తోడు సమంత కథానాయిక కావడం టీజర్‌, ట్రైలర్‌లకు బజ్‌ క్రియేట్‌, పాటలన్నీ సంగీత ప్రియులను అలరించడంతో సినిమాకు హైప్‌ క్రియేట్‌ అయింది. పైగా పవన్‌కల్యాణ్‌ ఎవర్‌గ్రీన్‌ హిట్‌ ‘ఖుషి’ సినిమా టైటిల్‌ ఈ సినిమాకు పెట్టడంతో ఈ కథతో ఏం చెప్పబోతున్నారనే ఆసక్తి నెలకొంది. ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిందీ చిత్రం. సోషల్‌ మీడియాలో ఈసిఇననిమాపై స్పందన ఎలా ఉందో చూద్దాం.

సినిమాకు ట్విట్టర్‌లో మంచి రెస్పాన్స్‌ వస్తోంది. చాలా కాలం తర్వాత హిట్‌ కొట్టామని విజయ్‌ ఫ్యాన్స్‌ హడావిడి చేస్తున్నారు. ఆన్‌స్ర్కీన్‌ సమంత, విజయ్‌ల మధ్య కెమెస్ట్రీ అదిరిందని చెబుతున్నారు. ఫస్టాఫ్‌లో సాగదీత ఉన్నా కామెడీ కవర్‌ చేసిందని చెబుతున్నారు. చివరి 30 నిమిషాలు భావోద్వేగంగా ఉందని ట్వీట్స్‌ చేస్తున్నారు. పాటలు కూడా మెప్పించేలా ఉన్నాయని పేర్కొన్నారు నెటిజన్లు.

ఓ నెటిజన్‌ మాత్రం కాస్త అసహనం ప్రదర్శించాడు. సినిమాలో కథ ప్రారంభ కావడానికే అరగంట పట్టిందని అది సహనానికి పరీక్షగా మారిందని రాసుకొచ్చాడు. ద్వితీయార్ధంలో కామెడీతో పాటు ఎమోషన్‌ బాగా వర్కౌట్‌ అయింది. సమంత్‌ గ్లామర్‌ ఆకట్టుకుందని 3 రేటింగ్‌ ఇచ్చాడు సదరు నెటిజన్‌.

‘లైగర్‌’లో విజయ్‌ ప్రూవ్‌ చేసుకోలేకపోయావు. ఈ సినిమాలో అతని డెడికేషన్‌ కనిపించింది. 200 శాతం ఎఫర్ట్‌ పెట్టారు అని అన్నాడు.

Updated Date - 2023-09-01T16:31:01+05:30 IST