Bichagadu2: మూడు రోజుల్లో కలెక్షన్ల వర్షం, విజయ్ ఆంటోనీ జాక్ పాట్ కొట్టాడు

ABN , First Publish Date - 2023-05-22T14:20:00+05:30 IST

విజయ్ ఆంటోనీ నటించి, దర్శకత్వం వహించి, నిర్మించిన 'బిచ్చగాడు 2' సినిమా తెలుగు రాష్ట్రాల్లో బాగా పుంజుకొంది. విజయ్ ఆంటోనీకి సరైన సమయంలో ఒక మంచి హిట్ ని తెలుగు ప్రేక్షకులు అందించారు. ఈ సినిమా మూడు రోజులకు గాని సుమారు రూ 9.5 కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్షన్ చేసి సూపర్ హిట్ దిశగా దూసుకుపోతింది. తమిళ సినిమా కన్నా తెలుగులోనే ఈ సినిమా బాగా ఆడుతోంది.

Bichagadu2: మూడు రోజుల్లో కలెక్షన్ల వర్షం, విజయ్ ఆంటోనీ జాక్ పాట్ కొట్టాడు
Bichagadu 2

నటుడు విజయ్ ఆంటోనీ (VijayAntony) తన 'బిచ్చగాడు 2' #Bichagadu2 తెలుగులో అంత ప్రచారం చేయనప్పటికీ, తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాలను ఆదరిస్తారు అనే విషయాన్నీ మరోసారి నిరూపించారు. విజయ్ ఆంటోనీ కి ఒక మంచి బ్రేక్ ఈ సినిమాతో ఇచ్చారు. తమిళ సినిమా కలెక్షన్స్ కన్నా తెలుగు సినిమా కలెక్షన్స్ బాగున్నాయని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు. ఎప్పటినుంచే ఆశగా ఎదురు చూస్తున్న సక్సెస్ విజయ్ ఆంటోనీ కి ఈ 'బిచ్చగాడు 2' #Bichagadu2Collections సినిమా ద్వారా వచ్చింది అని చెప్పాలి.

Bichagadu-Image-3.jpg

మొదటి రోజు పాజిటివ్ టాక్ తో సినిమా ఈవెనింగ్ షోస్ కి ప్రేక్షకులు బాగా వచ్చారు. అదే టాక్ తో, శనివారం, ఆదివారం కూడా ఈ సినిమాని ప్రేక్షకులు బాగా చూసారు. మూడు రోజులకు గాను ఈ సినిమా రూ 9.5 కోట్లు కలెక్టు చేసి రికార్డు స్రుస్థించింది. ఇది కేవలం తెలుగు సినిమా కలెక్షన్స్ మాత్రమే అని చెపుతున్నారు. అలాగే ఈ సినిమా సుమారు రూ 5.8 కోట్ల షేర్ కలెక్టు చేసిందని, ఇంకా సుమారు 75 లక్షలు కలెక్టు చేస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోతుందని కూడా ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు.

Bichagadu2-Image-2.jpg

అనే ఈ సినిమా ఒక పెద్ద హిట్ కాబోతోందని తెలుస్తోంది. విజయ్ ఆంటోనీ కి ఒక మంచి సమయానికి ఈ హిట్ వచ్చింది అని కూడా అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమా మీద అతను అసలు అన్నీ పెట్టుకొని, ఈ సినిమా దర్శకత్వంతో పాటు, నిర్మాణంలో కూడా ఎంతో కష్టపడ్డాడు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే ప్రమాదం కూడా సంభవించి అతి కష్టం మీద బయటపడ్డాడు. ఇప్పుడు ఈ విజయంతో ఆ కాశాలు అన్నీ మర్చిపోయి ఇంకో సినిమా తీయడానికి ఉపయోగపడుతుంది. దీనికి ఇంకో సీక్వెల్ తీసినా కూడా ఆశ్చర్యపడనక్కరలేదు. ఇందులో కావ్య తాపర్ (KavyaThapar) కథానాయికగా చేసింది.

Updated Date - 2023-05-22T14:20:00+05:30 IST