Bichagadu: విజయ్ ఆంటోనీ ఇంకో సీక్వెల్ ప్లాన్ చేసాడు

ABN , First Publish Date - 2023-05-25T11:48:44+05:30 IST

తిరుపతిలో తన సినిమా 'బిచ్చగాడు 2' ఆడుతున్న థియేటర్ల దగ్గర సందడి చేస్తున్న విజయ్ ఆంటోనీ ఈ సినిమాకి ఇంకో సీక్వెల్ 'బిచ్చగాడు 3' ఉంటుందని ప్రకటించాడు. మొదటి దానిలో వ్యక్తిగత సమస్య, రెండో దానిలో సామజిక సమస్య, మూడో దానిలో కూడా ఇంకో సామజిక సమస్య తీసుకొని చేస్తాను అని, భారీ బడ్జెట్ తో ఆ సినిమా ఉంటుందని చెప్పాడు.

Bichagadu: విజయ్ ఆంటోనీ ఇంకో సీక్వెల్ ప్లాన్ చేసాడు
Bichagadu 2

విజయ్ ఆంటోనీ (VijayAntony) కెరీర్ లో చాలా కాలం తరువాత ఈమధ్యనే విడుదల అయిన 'బిచ్చగాడు 2' #Bichagadu2 మంచి విజయం సాధించింది. ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా స్ట్రాంగ్ గా వెళుతోంది. విజయ్ ఆంటోనీ అప్పుడెప్పుడో కొన్ని సంవత్సరాల కిందట 'బిచ్చగాడు' #Bichagadu అనే సినిమా చేసి మంచి విజయం సాధించటమే కాకుండా, తెలుగులో కూడా ప్రేక్షకులను సంపాదించుకున్నాడు. ఆ తరువాత అంతటి విజయాన్ని మళ్ళీ ఈ 'బిచ్చగాడు 2' ద్వారానే వస్తోంది విజయ్ ఆంటోనీకి.

తెలుగులో ఎక్కువ ప్రచారం చేయనప్పటికీ తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాను ఎప్పుడూ ప్రోత్సహిస్తారు అన్నదానికి ఈ 'బిచ్చగాడు 2' ఒక ఉదాహరణ. విజయ్ ఆంటోనీ తమిళం లో ఎక్కువ ప్రచారం చేసాడు, కానీ తమిళ సినిమా కన్నా తెలుగులోనే బాగా నడుస్తోంది. ఇప్పుడు విజయ్ ఆంటోనీ ఆంధ్ర తెలంగాణలోని కొన్ని సిటీస్ లో పర్యటిస్తూ, ఈ సినిమా ఆడుతున్న థియేటర్స్ దగ్గర సందడి చేస్తున్నాడు.

Bichagadu2-Image-2.jpg

ఆ క్రమంలోనే తిరుపతిలోని థియేటర్స్ లో సందడి చేస్తూ ఒక ప్రకటన చేసాడు. 'బిచ్చగాడు' మొదటి సినిమా ఒక వ్యక్తి సమస్య అయితే, 'బిచ్చగాడు 2'లో ఒక సామజిక సమస్యని చూపించడం జరిగింది అని చెప్పాడు. ఇప్పుడు కచ్చితంగా ఆ రెండిటికి ఇంకో సీక్వెల్ 'బిచ్చగాడు 3' #Bichagadu3 తీస్తాను అని చెప్పాడు. అయితే ఈ రాబోయే సీక్వెల్ చాలా భారీ బడ్జెట్ తో, ఇంకొక సామజిక సమస్యతో తీస్తాను అని చెప్పాడు విజయ్ ఆంటోనీ. అతని భార్య ఫాతిమా ఈ సినిమాలని నిర్మించింది. విజయ్ ఆంటోనీ ఈ 'బిచ్చగాడు 2' తో దర్శకుడిగా కూడా మారాడు. 'బిచ్చగాడు 2' విజయం తనకి మరింత బరువు బాధ్యతలని పెంచింది అని చెప్పాడు విజయ్ ఆంటోనీ. అందుకే రాబోయే సీక్వెల్ చాలా భాద్యయుతంగా తీస్తాను అని చెప్తున్నాడు. 'బిచ్చగాడు 2' లో కావ్య తాపర్ (KavyaThapar) కథానాయిక.

Updated Date - 2023-05-25T11:48:44+05:30 IST