సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Daggubati Venkatesh: 'సైంధవ్' కి స్ఫూర్తి ఆ ఇంగ్లీష్ సినిమా ?

ABN, First Publish Date - 2023-04-12T14:39:53+05:30

వెంకటేష్ దగ్గుబాటి సినిమా 'సైంధవ్' షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా కథ ఒక యాక్షన్ జానర్ అని తండ్రి కూతుళ్ళ మధ్య నడుస్తుంది అని అంటున్నారు. దీనికి స్ఫూర్తి ఒక ఇంగ్లీష్ సినిమా అని కూడా అంటున్నారు

Venkatesh in Saindhav
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంకటేష్ దగ్గుబాటి 'సైంధవ్' (Saindhav) అనే సినిమా షూటింగ్ తో బిజీ గా వున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకొని రెండో షెడ్యూల్ వైజాగ్ లో షూట్ చేస్తున్నారు. ఈ సినిమా నుండి వెంకటేష్ (Daggubati Venkatesh) ఫస్ట్ లుక్ కొన్ని రోజుల కిందట విడుదల అయింది, అందులో వెంకటేష్ కొంచెం ఏజ్ గా కనపడే గెట్ అప్ లో వున్నాడు, దానికి మంచి పాజిటివ్ టాక్ కూడా వచ్చింది.

అయితే ఈ సినిమా కథ అంతా వెంకటేష్, అతని కూతురు చుట్టూ తిరుగుతుంది అని అంటున్నారు. అలాగే ఇదొక యాక్షన్ మూవీ కూడా అని చెప్తున్నారు. దీనికి శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకుడు, కాగా అతను ఇంతకు ముందు 'హిట్' (Hit) అనే సినిమాలు రెండు తీసాడు. ఇది అతనికి మూడో సినిమా.

అయితే ఈ 'సైంధవ్' సినిమాకి కథ ఒక ఇంగ్లీష్ మూవీ నుండి తీసుకున్నారు అని పరిశ్రమలో ఒక టాక్ నడుస్తోంది. లియామ్ నీసన్ (Liam Neeson) నటించిన 'టేకెన్' (Taken) అనే యాక్షన్ సినిమా స్ఫూర్తి అని అంటున్నారు. 'టేకెన్' సినిమా కి తరువాత రెండు సీక్వెల్స్ వచ్చాయి. అందులో లీడ్ యాక్టర్, తన కూతురి గురించి విలన్స్ తో పోరాడుతూ ఉంటాడు. అందులో అతను రిటైర్డ్ పోలీస్, అలాగే ఇందులో కూడా వెంకటేష్ గన్ పట్టుకున్న లుక్ ఒకటి బయటకి వచ్చింది కాదా, అదీ కాకుండా ఈ సినిమా కథ కూడా కూతురి గురించి అని అంటున్నారు, అందుకని 'టేకెన్' సినిమా నుండి స్ఫూర్తి అని పరిశ్రమలో టాక్ నడుస్తోంది. ఇందులో శ్రద్ధ శ్రీనాథ్ (Shraddha Srinath) కథానాయకురాలిగా నటిస్తోంది.

ఇప్పుడు ఇంకా ఈ సినిమా షూటింగ్ దశలోనే వుండు, ఆ తరువాత సినిమా విడుదల అయ్యాక అప్పుడు తెలుస్తుంది, ఈ కథ గురించి. అంత వరకు ఎదురుచూడాల్సిందే !

Updated Date - 2023-04-12T14:41:17+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!